ఉండి రాజాధిరాజా ఆయనే !

ఉండిలో రాజాధిరాజు ఎవరు ఇది ప్రశ్న. జవాబు చాలా కష్టం. ఎందుకంటే ఉండి అంటేనే రాజుల కోట.

Update: 2024-05-18 03:40 GMT

ఉండిలో రాజాధిరాజు ఎవరు ఇది ప్రశ్న. జవాబు చాలా కష్టం. ఎందుకంటే ఉండి అంటేనే రాజుల కోట. అక్కడ వారు తప్ప ఎవరూ పాగా వేయలేరు. ఉండి నుంచి 2019లో సైతం టీడీపీ గెలిచింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి సీటు అది. అలాంటి సీటులో రెబెల్ ఎంపీగా పేరు పడిన ట్రిపుల్ ఆర్ దిగిపోయారు. ఎన్నికలకు అతి తక్కువ సమయంలో టీడీపీ టికెట్ తెచ్చుకుని మరీ ఉండి నుంచి రఘురామ క్రిష్ణం రాజు నామినేషన్ వేశారు.

ఆయన కంటే ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పార్టీ టికెట్ కేటాయించడం ఆయన ప్రచారంలోకి దిగడం అంతా జరిగిపోయాయి. ఇక్కడ టీడీపీలో మరో నేత కలవపూడి శివరామరాజు ఉన్నారు. ఆయన 2014లో గెలిచిన వారు. టీడీపీలో మరో బిగ్ షాట్. ఆయనకు టికెట్ ఇవ్వలేదని అలిగి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.

ఇక వైసీపీ నుంచి చూస్తే పీవీఎల్ న‌ర‌సింహ‌రాజు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సైతం వేగేశ్న వెంక‌ట గోపాల కృష్ణంరాజుకు టికెట్ ఇచ్చింది. ఇలా నలుగురు రాజులు పోటీ చేశారు.అందరూ దిట్టమైన వారే. అంగబలం అర్ధబలంలో సరిసాటి తమకు లేరు అనిపించుకున్న వారే. ఉండిలో రఘురామ రాజుకు ఎదురులేదని మొదట ప్రచారం సాగింది. కానీ కలువపూడి శివ గట్టిగా ఫైట్ ఇవ్వడంతో పాటు టీడీపీ ఓట్లకు గండిపెట్టడటంతో డౌట్ కొడుతోందిట.

అదే విధంగా టీడీపీలోనే ఉంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా పెద్దగా రఘురామకు సహకరించలేదని ఒక టాక్ నడుస్తోంది. రఘురామ ఎమ్మెల్యే అయితే పాతుకుపోతారు అన్నది ఒక బెంగ అని అంటున్నారు. దాంతో ఆయన అనుచరులు మాత్రం కలువపూడి శివకే జై కొట్టారు అని టాక్ నడుస్తోంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న కలువపూడికి మద్దతు ఇవ్వడం న్యాయమని కూడా కొంతమంది తమ్ముళ్ళు భావించారు అని అంటున్నారు.

ఇలా నలుగురు రాజులు పోటీ చేసిన ఉండిలో మొదట్లో రఘురామ గెలుస్తారు అని టాక్ వచ్చింది. ఆ తరువాత టీడీపీ పోరులో వైసీపీ నుంచి పీవీఎల్ న‌ర‌సింహ‌రాజుకే చాన్స్ అనుకున్నారు. తీరా పోలింగ్ సరళి చూస్తే మాత్రం కలువపూడి శివ ఎమ్మెల్యే అవుతారు అన్నది తేలుతోంది. అయితే రఘురామ అవకాశాలు కూడా ఇంకా సజీవంగానే ఉన్నాయని ఆయన వర్గం అంటోంది.

ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా టీడీపీకే ప్లస్ అవుతుంది. ఉండిలో రాజాధిరాజా ఎవరు అన్న దాని మీద బెట్టింగు కూడా కడుతున్నారు. ఏది ఏమైనా లోకల్ గా వినిపిస్తున్న మాట ఒక్కటే. ఎవరు గెలిచినా వేయి లోపే మెజారిటీట. ఆ గెలుపులో వైసీపీ కూడా ఉండవచ్చు అన్నది లేటెస్ట్ టాక్. సో ఉండి ఫలితం వెరీ ఇంట్రెస్టింగ్ సుమా అంటున్నారు.

Tags:    

Similar News