యూఎస్ ని వణికించిన భూకంపాలు... యూ.ఎస్.జీ.ఎస్. షాకింగ్ అంచనాలు!
కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 12 గంటల వ్యవధిలో సుమారు 57 భూకంపాలు సంభవించాయి.
కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 12 గంటల వ్యవధిలో సుమారు 57 భూకంపాలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూ.ఎస్.జీ.ఎస్.) వెల్లడించిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 5.2 తీవ్రతతో భూకంప కేంద్రం కెర్న్ కౌంటీని 20 మైళ్ల దూరంలో ఈ భూకంపాలు సంభవించింది.
ఇదే సమయంలో బుధవారం మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఇదే సమయంలో లామోంట్ కు నైరుతి దిశలో 14 మైళ్ల దూరంలో ఉదయం 9:09 గంతలకు భూమి కంపించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం రోజుల్లో 5 కంటే ఎక్కువ తీవ్రతతో మరికొన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉందని ఏజెన్సీ వెల్లడించింది.
అయితే మంగళవారం కాలిఫోర్నియాను తాకిన భూకంపం ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సంభవించిన అత్యంత బలమైనదిగా చెబుతున్నారు. గత ఏడాది 2023 మే 12న కాన్వోండం సమీపంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే తాజాగా భూకంపాల వల్ల నిర్మాణాలకు జరిగిన ప్రమాదాలకు సంబంధించి ప్రాథమిక నివేదికలు ఇంకా వెలువడలేదు!
ఈ భూకంప తీవ్రత వెంచూరా, కమరిల్లో, సిమీ వ్యాలీ, ఎన్సినో, శాంటా క్లారిటా, హాలీవుద్, నార్త్ హాలీవుడ్, వుడ్ ల్యాండ్ హిల్స్ ప్రాంతాల్లోని కనిపించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా లాజ్ ఫెలిజ్ లోని ఓ నివాసి 45 సెకన్ల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి కాస్త బలమైనది కాగా.. రెండు స్వల్పమైనవని తెలిపారు.
యూ.ఎస్.జీ.ఎస్. అంచనా ప్రకరం.. రాబోయే మూడు దశాబ్ధాల్లో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో 7 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం 46 శాతం ఉందని, బే ఏరియాలో 51 శాతం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో 7.5 తీవ్రతతో రాబోయే ముప్పై ఏళ్లలో శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం 20% ఉందని అంచనా వేస్తున్నారు.