హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య లక్షనా?

ఓపక్క హైదరాబాద్ మహానగర భూములు కోట్లకు కోట్లు పలుకుతున్న వేళ.. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు ఆశ్చర్యానికి గురి చేసింది.

Update: 2023-08-18 04:18 GMT

ఓపక్క హైదరాబాద్ మహానగర భూములు కోట్లకు కోట్లు పలుకుతున్న వేళ.. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు అందుకు భిన్నమైన విషయాల్ని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలికి.. హైదరాబాద్ మహానగర భూములకు విపరీతమైన డిమాండ్ నెలకొన్న వేళ.. ప్రభుత్వం వేస్తున్న భూముల వేలానికి అనూహ్య స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ మూడు నెలల కాలంలో హైదరాబాద్ మార్కెట్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 5 శాతం పెరిగినట్లుగా ప్రాప్ ఈక్విటీ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది.

దేశంలోని తొమ్మది ముఖ్య పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలకు సంబంధించిన వివరాల్ని పేర్కొన్న వేళ.. అమ్ముడు కాని ఇళ్ల జాబితాలో హైదరాబాద్ ప్రముఖంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఏప్రిల్ - జూన్ మధ్యలో దేశంలోని తొమ్మిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 1,22,213యూనిట్లుగా పేర్కొంది. తొమ్మిది పట్టణాల్లో అమ్ముడుపోని యూనిట్లు గతంతో పోలిస్తే 2 శాతం తగ్గగా.. హైదరాబాద్ లో మాత్రం 5 శాతం పెరగటం గమనార్హం.

టైర్ 1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో అమ్మకం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా ఉంగా.. మార్చి చివరినాటికి ఉన్న ఇళ్లతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ముంబయిలో అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గాయి. నవీ ముంబయిలో మాత్రం పెరిగాయి. ఢిల్లీ మార్కెట్ లో అమ్ముడు కాని ఇళ్ల యూనిట్లు 26 వాతం తగ్గగా.. చెన్నైలో 18 వాతం తగ్గినట్లుగా నివేదిక వెల్లడించింది. ఫుణెలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 9 శాతం పెరిగాయి. బెంగళూరులోనూ అమ్ముడుకాని ఇళ్ల సంఖ్య 4 శాతం పెరగ్గా.. కోల్ కతాలో 20 శాతం పెరిగాయి.

ఇలా ఆయా పట్టణాల్లో అమ్ముడుకాని ఇళ్లకు సంబంధించిన హెచ్చుతగ్గుదలు ఉన్నా.. ఒక్క థానేలో మాత్రం అమ్ముడకాని ఇళ్లు 1,09,511 ఉన్నాయి. ఆ తర్వాతి నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ అమ్ముడు కాని ఇళ్ల యూనిట్లు 5 శాతం తగ్గి.. 99,989 ఇళ్లు ఉన్నట్లుగా పేర్కొంది. మిగిలిన ఏడు పట్టణాల్లో ముంబయిలో 60వేలు ఉండగా.. నవీ ముంబయిలో 31వేలు.. ఢిల్లీలో 42వేలు, చెన్నైలో 19,900, ఫూణెలో 75వేలు.. బెంగళూరులో 52వేలు.. కోల్ కతాలో 21,947 యూనిట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News