ఆ అసెంబ్లీలో గుట్కాపై బ్యాన్.. ఎమ్మెల్యేలు తింటే ఫైన్

అయినప్పటికీ ఎమ్మెల్యేలు ఎవరైనా గుట్కా తిన్నట్లు తాను గుర్తిస్తే రూ.వెయ్యి ఫైన్ వేస్తామని చెప్పారు.;

Update: 2025-03-06 05:31 GMT

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆసెంబ్లీ ఆవరణలో గుట్కా.. పాన్ మసాలా తినటాన్ని నిషేధించారు. అయినప్పటికీ ఎవరైనా ఎమ్మెల్యేలు తిని.. ఉమ్మి ఊస్తే.. వారికి జరిమానా విధిస్తానని స్పష్టం చేశారు. ఇటీవల జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకుహాజరైన సందర్భంలో అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద కార్పెట్ మీద గుట్కాను ఉమ్మి వేసిన వైనాన్ని గుర్తించారు.

దీన్ని స్వయంగా కడిగేసిన ఆయన.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయటం తెలిసిందే. గుట్కాను అసెంబ్లీ ఆవరణలో ఉమ్మిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసని.. తనను ప్రైవేటుగా కలిసి వివరణ ఇస్తే సరిపోతుందని.. లేదంటే తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సదరు ఎమ్మెల్యే ఆయన్ను కలిశారా? తప్పు ఒప్పుకొని చంపలు వేసుకున్నారా? లేదా? అన్నది పక్కన పెడితే.. అసెంబ్లీ ఆవరణలో గుట్కా తినటంపై నిషేధాన్ని విదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయినప్పటికీ ఎమ్మెల్యేలు ఎవరైనా గుట్కా తిన్నట్లు తాను గుర్తిస్తే రూ.వెయ్యి ఫైన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీని పరిశుభ్రంగా ఉంచటం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News