సివిల్స్ కు ప్లాన్ చేస్తున్నారా? కొత్త రూల్ తెలుసా?
జనవరి 22న విడుదలైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రూల్స్ 2025 ప్రకారం సివిల్స సర్వీసెస్ పరీక్షకు అప్లికేషన్ ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
గతానికి భిన్నంగా సివిల్స్ మీద ఆసక్తి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో కొన్ని వర్గాలు వారు మాత్రమే సివిల్స్ ను టార్గెట్ చేసేవారు. ఇప్పుడు అందుకుభిన్నంగా దేశంలోనే అత్యంత క్లిష్టమైన ఈ పోటీ పరీక్షకు ప్లాన్ చేస్తుననోళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సివిల్స కు ప్రిపేరవుతున్న వారంతా అపే గ్రేడ్ కావాల్సిన సమాచారం ఒకటి వచ్చింది. సివిల్స్ పరీక్షలకు సంబంధించి కొత్త నిబంధనను యూపీఎస్సీ తీసుకొచ్చింది.
గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రిలిమనరీ పరీక్షలకు అప్లై చేసుకునే వేళలోనే అభ్యర్థుల వయసు.. రిజర్వేషన్ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాల్ని సమర్పించటం తప్పనిసరి చేసింది. ఇటీవల ప్రకటించిన కొత్త నియమావళి ప్రకారం ఈ మార్పు వచ్చింది.గతంలో ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతే అభ్యర్థులు తమ వయసు.. రిజర్వేషన్ ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించాల్సి వచ్చేది.
ఇటీవల మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్ తప్పుడు ఓబీసీ.. మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి.. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ కు ఎంపిక కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. జనవరి 22న విడుదలైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రూల్స్ 2025 ప్రకారం సివిల్స సర్వీసెస్ పరీక్షకు అప్లికేషన్ ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
సదరు దరఖాస్తులోనే పుట్టిన తేదీ.. కులం.. వర్గం.. విద్యార్హతలు.. సర్వీస్ ప్రిపరెన్స్ లు పేర్కొనాలి. అలానే వాటికి సంబంధించిన రుజువుల పత్రాల్ని కచ్ఛితంగా అప్ లోడ్ చేయాలి. ఒకవేళ అప్లికేషన్ తో పాటు రుజువుల్ని అప్ లోడ్ చేయకుంటే మాత్రం అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. మే 25నజరిగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష ద్వారా 979 మందిని భర్తీ చేయనున్నారు. ఇందులో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. అప్లికేషన్లు అప్ లోడ్ చేయటానికి ఫిబ్రవరి 11 సాయంత్రం ఆరు గంటల్లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.