అమెరికాలో ఉంటున్నారా?... ఈ చట్టం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి!

ఈ చట్టం ప్రకారం... ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా, క్రమశిక్షణ తప్పి నడుచుకుంటే వెంటనే అరెస్ట్ చేస్తారు!

Update: 2025-01-24 00:30 GMT

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వలసదారులను వణికించే నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. మరో సంచలన విషయాన్ని తెరపైకి తెచ్చారు. లేకెన్ రిలే చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని.. ఇకపై అమెరికాలోని వలసదారులు చిన్నపాటి తప్పులు చేసినా వాటిని నేరాలుగా పరిగణించి స్వదేశానికి ప్యాక్ చేసే చట్టానికి జై కోట్టారు. ఇప్పుడు ఇది మరో సంచలనంగా మారింది.

అవును... వలసదారులను వణికించే లేకెన్ రిలే చట్టాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. 46 మంది డెమోక్రాట్లు రిపబ్లికన్లకు అనుకూలంగా ఓటు వేయడంతో 263 - 156 ఓట్లతో సభలో ఆమోదం పొందింది. సెనేట్ 64 - 35 ఓట్లతో చట్టాన్ని ఆమోదించింది. దీంతో... అమెరికాలో ఉన్న వలసదారులను ఈ విషయం వణికిస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ఏ చిన్న తప్పు చేసిన స్వదేశానికి పంపించేస్తారు!

వాస్తవానికి 2022లో లేకెన్ రిలే అనే అమెరికా అమ్మాయిని యూనివర్శిటీ ఆఫ్ జార్జియా క్యాంపస్ లో జాగింగ్ చేస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి, హత్య చేశాడు వెనిజులా నుంచి వచ్చిన పత్రాలు లేని వలసదారుడు ఆంటోనియా ఇబర్రా. అయితే అతడిపై అప్పటికే ఓ కేసు నమోదై ఉంది. కానీ.. అతడిని అరెస్ట్ చేయలేదు.. అందుకు కారణం సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడం అని అంటారు.

దీంతో... అతడిని ముందటి కేసులోనే అరెస్ట్ చేసి, జైల్లో పడేసి ఉంటే.. ఈ లేకెన్ రిలే అనే అమ్మాయి హత్యకు గురయ్యేది కాదు కదా అనేది ఇక్కడ పాయింట్.. వలసదారులు విచ్చల విడిగా తిరిగుతూ ఉండటం వల్ల స్థానిక అమెరికన్లకు భద్రత లేకుండా పోతోంది అనేది ఆరోపణ.. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని కొన్ని లొసుగులు.. ఇలాంటి వలసదారులకు వరంగా మారుతున్నాయనేది కీలక వాదన.

దీంతో... ఈ విషయం 2024 ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఈ విషయాన్ని హైలెట్ చేసిన రిపబ్లికన్స్.. ఆమె పేరిట చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు! ఆమె హత్య ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వైఫల్యం అంటూ దుబ్బయట్టారు. ఈ సమయంలో ఆమె పేరిట చట్టాన్ని తీసుకురాగా.. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ దాన్ని ఆమోదించింది.

ఈ చట్టం ప్రకారం... ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా, క్రమశిక్షణ తప్పి నడుచుకుంటే వెంటనే అరెస్ట్ చేస్తారు! అంతే కాకుండా.. వాళ్లను వెంటనే స్వదేశానికి పంపించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతో పాటు పలు విదేశీయులకు ప్రమాదంగా మారబోతోందని అంటున్నారు.

ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా విచ్చలవిడిగా ఉంటె వెంటనే అరెస్ట్ చేస్తారు.. అంతేకాకుండా వాళ్ళను వెనువెంటనే వారి స్వదేశానికి తరిమేస్తారన్నమాట. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న.. ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతోబాటు పలు విదేశీయులకూ ప్రమాదంగా మారుతోంది. దీంతో... తప్పు ఎంత చిన్నదైనా, పెద్దదైనా ఇలా స్వదేశానికి ప్యాక్ చేసి పంపేస్తామనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!

దీంతో... యువతో, విద్యార్థులో.. తెలిసో తెలియకో ఏదో చిన్న చిన్న తప్పులు, నేరాలు చేస్తే వారికి జరిమానా, జైలు శిక్ష వంటివి వేయాలి కానీ.. ఏకంగా దేశం నుంచి బహిష్కరించడం ఏమిటి, వారి జీవితాన్ని చిదిమేయడం ఏమిటి అనేది ఇక్కడ చాలా మంది అభ్యంతరం. అయితే... అది అమెరికా, అక్కడ ఉన్నది డొనాల్డ్ ట్రంప్ కాబట్టి తప్పదు అనే కామెంట్లు తదనుగుణంగా వినిపిస్తున్నాయి.

భారతీయులు ఆందోళన చెందాలా?:

లేకెన్ రిలే చట్టం ఆమొదించబడటం అనేది.. అమెరికాలోని భారతీయ వలసదారులు, ప్రత్యేకించి తాత్కాలిక వీసాలు, పత్రాలు లేని కార్మికులు, వీసా షరతులను ఉల్లంఘించిన వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. షాప్స్ లో చోరీలకు పాల్పడటం, చిన్న చిన్న దోపిడీ వంటివి ఇంతకాలం చిన్న నేరాలేమో కానీ.. ఇకపై కాదు! ఈ చట్టం ద్వారా.. ఇమ్మిగ్రేషన్ లో ఇంతకాలం చిన్న చిన్న ఉల్లంఘనలుగా ఉన్నవి కఠినమైన చర్యలు దారితీయొచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News