గూడు చెదిరిన అమెరికా.. 2024 మరీ ఘోరం

అమెరికా చరిత్రలో అత్యంత కీలక సంవత్సరం 2024. అధ్యక్షుడిగా విఫల ముద్ర వేసుకున్న బైడెన్ పార్టీ ఓడిపోయి.. బలమైన లక్ష్యాలతో వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.

Update: 2024-12-30 03:30 GMT

అమెరికా అంటే అగ్ర రాజ్యం.. అత్యంత డెవలప్ చెందిన దేశమే కాదు.. డాలర్ల కోసం ప్రపంచమంతా కలవరించే కలల దేశమే కాదు.. అమెరికాలోనూ పేదలుంటారు.. ఇళ్లు లేని నిరుపేదలుంటారు. ఎందరో ఎక్కడెక్కడి నుంచో అమెరికాకు వెళ్లి.. సంపాదించి ఇళ్లు కట్టుకుని స్థిరపడడమో.. తమ దేశంలో ఇళ్లు కట్టుకోవడమో చేస్తుంటే అమెరికాలో మాత్రం ఇళ్లు లేని వారి సంఖ్య పెరుగుతోందంట.. వినడానికి ఇది వింతగా ఉన్నా.. గణాంకాలు చెబుతున్నది వాస్తవమే ఇది.

ఈ ఏడాదే అధికం..

అమెరికా చరిత్రలో అత్యంత కీలక సంవత్సరం 2024. అధ్యక్షుడిగా విఫల ముద్ర వేసుకున్న బైడెన్ పార్టీ ఓడిపోయి.. బలమైన లక్ష్యాలతో వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. కాగా, అమెరికాలో నిరాశ్రయుల సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా గృహ సంక్షోభం తీవ్రమైంది. చాలా రాష్ట్రాలు ఇది మూడంకెల శాతంలో ఉండడం గమనార్హం. ఒకే రాత్రి 7,71,480 మంది నిరాశ్రయులైనట్లు ఫెడరల్ నివేదిక తెలియజేస్తోంది. 2023 నుంచి 18.1 శాతం పెరుగుదల నమోదైందట.

ఆ రెండు రాష్ట్రాల్లో..

నిరాశ్రయత పరంగా ఇల్లినాయిస్, హవాయి రాష్ట్రాలలో అత్యంత నాటకీయ పెరుగుదల నమోదైంది. గృహ స్థోమత సవాళ్లు, వలసలే దీనికి కారణం. ఇల్లినాయిస్ లో అమెరికాలోనే అత్యంత అధికంగా 116.2 శాతం పెరుగుదల నమోదైంది. ఇక్కడ నిరాశ్రయ జనాభా 25,832కి చేరుకుంది. చికాగో ప్రాంతం ఈ పెరుగుదలలో 91 శాతం వాటా కలిగి ఉంది. దీనికి ప్రధాన కారణం వలసలు పోటెత్తడమే. వలసదారులు, ఆశ్రయం కోరే కుటుంబాలతో సహా కొత్తగా వచ్చినవారు చికాగోలోని అత్యవసర ఆశ్రయాల్లో 13,600 మందిపైగా ఉన్నారు.

ఇక హవాయి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 87 శాతం పెరుగుదల నమోదైంది. నిరాశ్రయ జనాభా 11,637కి చేరింది. కాగా, 2023లో మౌయి కార్చిచ్చు దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. 5,200 మంది నిరాశ్రయులయ్యారు.

మసాచుసెట్స్ 53.4 శాతం, న్యూయార్క్ 53.1 శాతం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. న్యూయార్క్ కు శరణార్థుల బెదడ అధికంగా ఉంది. ఇక్కడ ఆశ్రయం పొందిన నిరాశ్రయుల పెరుగుదలలో దాదాపు 88 శాతం వీరిదే.

కొలరాడో 29.6 శాతం పెరుగుదలతో నిరాశ్రయులలో టాప్-5లో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18,715 మంది నిరాశ్రయులయ్యారు. 134 శాతం పెరుగుదలతో నిరాశ్రయుల సంఖ్య రెట్టింపైంది.

అమెరికాలో నిరాశ్రయులైన జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు కాలిఫోర్నియాలోనే ఉన్నారు. ఈ రాష్ట్రం 2023 నుంచి 3.1 శాతం పెరుగుదలను చూసింది. నిరాశ్రయ జనాభా 5,685 మంది పెరిగారు. వీరిలో 66.3 శాతం మంది వీధులు, పాడుబడిన భవనాలు లేదా వాహనాలలో నివసిస్తున్నారు.

2024లో దాదాపు 1,50,000 మంది పిల్లలు ఒకే రాత్రిలో నిరాశ్రయులయ్యారు, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 33 శాతం పెరిగింది.

నల్లజాతీయులు, ఆఫ్రికన్ అమెరికన్లు అమెరికా జనాభాలో 12 శాతం. నిరాశ్రయులైన వారిలో వీరే 32 శాతం.

Tags:    

Similar News