భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో యూఎస్ వీసాలు... ఎన్నంటే...?

అవును... తమ దేశంలో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు రికార్డ్ స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేసింది అమెరికా.

Update: 2023-11-29 06:52 GMT

ఉన్నత విద్యనభ్యసించడం కోసం అమెరికాకు వెళ్లాలని ఆశించే భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఉన్నత చదువులు చదువుకుని.. అక్కడే సెటిల్ అవ్వాలని, పిల్లలకు అద్భుతమైన భవిష్యత్ ఉండాలని కోరుకుంటారు వారి తల్లితండ్రులు! ఈ క్రమంలో తాజాగా భారతీయ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా రికార్డ్ స్థాయిలో వీసాలు మంజూరు చేసింది.

అవును... తమ దేశంలో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు రికార్డ్ స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేసింది అమెరికా. ఇందులో భాగంగా ఇండియాలోని యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌ లు 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య 1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసి ఆల్ టైం రికార్డ్‌ ను సాధించాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌ మెంట్ ప్రకటించింది.

ఇదే సమయంలో 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు అగ్రరాజ్యం అమెరికా ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసి రికార్డు సాధించినట్లు యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ పేర్కొంది. అదేవిధంగా... అమెరికా రాయబార కార్యాలయం వ్యాపారం, పర్యాటకం కోసం 8 మిలియన్ల సందర్శకుల వీసాలను జారీ చేసింది.

ఈ రికార్డ్ స్థాయి వీసాల మంజూరుకు తోడు వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ టైంను తగ్గించడానికి అమెరికా చర్యలు తీసుకుంటోందని.. భారత్ తో దౌత్యపర సంబంధాలు పెంపొందించుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న కృషిలో భాగంగా వీసాల మంజూరు విషయంలో ఇండియాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో... భారత్‌ లోని యూఎస్ వీసా మిషన్లు వారానికి ఆరు, ఏడు రోజులు పనిచేశాయని.. విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే ముందు ఇంటర్వ్యూలు జరిగేలా చూశాయని.. ఈ ఏడాది సైతం భారత్ నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియ కొనసాగుతుందని.. ఇది తాను ఊహించినదానికంటే ఎక్కువని యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ వెల్లడించారు.

Tags:    

Similar News