వంగవీటి రాధా కోసం బాబు రిజర్వ్ చేసిన సీటు...?
బాబు రాధా ఫ్యూచర్ కి భరోసా ఇస్తూ ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటుని రిజర్వ్ చేసి పెట్టారని అంటున్నారు.
విజయవాడ రాజకీయాలలో వంగవీటి రాధా కలకలం రేపుతారు అనుకుంటే నారా లోకేష్ పాదయాత్రలో ఆసాంతం కనిపించారు. అంతే కాదు లోకేష్ తో చాలా సన్నిహితంగా మెలిగారు. దీన్ని చూసిన వారు రాధా ఏ పార్టీలోకి వెళ్లరని నిర్ధారించేశారు. ఆయన కచ్చితంగా టీడీపీలో ఉంటారని అంటున్నారు.
అయితే లోకేష్ పాదయాత్ర విజయవాడ రానంతవరకూ రాధా రాజకీయం మీద రకరకాలైన ప్రచారాలు జరిగాయి. ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారని, ఆయన అక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు తీసుకుని పోటీ చేస్తారని. ఈ నెలాఖరు నాటికి రాధా రాజకీయం ఒక కీలక మలుపు తిరుగుతుందని.
అయితే అవన్నీ తప్పు అని రాధా లోకేష్ తో కలియ తిరుగుతున్న తీరు స్పష్టం చేస్తోంది. దాంతో రాధా టీడీపీలో ఉంటారని అంటున్నారు అంతవరకూ ఓకే కానీ రాధా టీడీపీలో ఉంటే ఆయనకు సెంట్రల్ సీటు దక్కుతుందా అన్నది ఒక చర్చగా ఉంది. విజయవాడలో తూర్పు నుంచి గద్దే రామ్మోహన్ పోటీ చేస్తారు. ఎందుకంటే అది ఆయన సిట్టింగ్ సీటు. ఇక విజయవాడ వెస్ట్ ని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని అంటున్నారు. అక్కడ నుంచి పోతుల మహేష్ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.
విజయవాడ సెంట్రల్ సీటు. ఇదే రాధా కోరుకున్న సీటు. కానీ ఈ సీటు నుంచి పొలిట్ బ్యూరో మెంబర్ అయిన బొండా ఉమా పోటీ చేస్తారు. విజయవాడ ఎంపీ సీటు కూడా టీడీపీ క్యాండిడేట్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. మరి రాధా రాజకీయ దారెటు అన్న ప్రశ్నకు జవాబు చంద్రబాబు సైడ్ నుంచే అంటున్నారు. బాబు రాధా ఫ్యూచర్ కి భరోసా ఇస్తూ ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటుని రిజర్వ్ చేసి పెట్టారని అంటున్నారు.
ఈ సీటు నుంచి రాధా పోటీ చేస్తే ఆ పరిధిలో ఉన్న ఏడంటే ఏడు అసెంబ్లీ సీట్లు కూడా టీడీపీ ఖాతాలో పడతాయని బాబు అంచనా కడుతున్నారని అంటున్నారు. ఒకవేళ రాధా కానీ ఎంపీగా పోటీకి నో చెబితే ఆయన్ని గోదావరి జిల్లాల నుంచి పోటీకి దించుతారని అంటున్నారు. అక్కడ కాపు సామాజికవర్గం బలంగా ఉంది. దాంతో సరైన సీటు నుంచి రాధా చేత పోటీ చేయిస్తే ఆయన గెలుపుతో పాటు గోదావరి జిల్లాలు కూడా టీడీపీ వైపుగా టర్న్ అవుతాయని ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.
మరి రాధాకు ఇవి ఇష్టమేనా అన్నది తేలాల్సి ఉంది. అయితే జనసేనలోకి రాధా వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. పొత్తు ఉన్నా సరే కీలక సీట్ల విషయంలో టీడీపీ రాజీపడదు అని అంటున్నారు. అందుకే రాధా పార్టీ మారినా సీటు కోరుకున్నది దక్కనపుడు ఉన్న పార్టీలోనే బెటర్ చాన్స్ ని వెతుక్కోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నరు. సో రాధా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ చంద్రబాబు నారా లోకేష్ ద్వారా చెప్పాల్సింది రాధాకు చెప్పించి ఉంటారని అంటున్నారు.