సుజ‌నాకు వంగ‌వీటి మ‌ద్ద‌తు.. రూటు మారుతుందా?

ఇక‌, సుజ‌నాకు మ‌ద్ద‌తుగా తాజాగా వంగ‌వీటి రంగా కుమారు డు, వంగ‌వీటి రాధా ప్ర‌చారం చేశారు.

Update: 2024-05-01 13:54 GMT

బీజేపీ నాయ‌కుడు, కూట‌మి అభ్య‌ర్థిగా విజ‌యవాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి.. ఎన్నికల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఉద‌యం పూట ఎండ ఎక్కు వ‌గా ఉంద‌ని చాలా మంది నాయకులు సాయంత్రం పూట మాత్ర‌మే ప్ర‌చారం చేస్తుండ‌గా.. సుజ‌నా మా త్రం.. ఉద‌యం కూడా ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. పెద్ద ఎత్తున మేళ తాళాల‌తో ఆయ‌న ప్ర‌చా రానికి వెళ్తున్నారు.

ప్ర‌జ‌ల నుంచి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. ఇక‌, సుజ‌నాకు మ‌ద్ద‌తుగా తాజాగా వంగ‌వీటి రంగా కుమారు డు, వంగ‌వీటి రాధా ప్ర‌చారం చేశారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీలు, క‌మ్యూనిస్టు కుటుంబాల‌కు చెం దిన వారు.. వంగ‌వీటికి ఒక‌ప్ప‌టి అనుచ‌రులు. దీంతో ఆయా కుటుంబాల‌ను ఆక‌ట్టుకునేందుకు వంగవీటి రాధాను తీసుకువ‌చ్చార‌ని అంటున్నారు. ఇక‌, కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌ఫున రాధా ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో త‌మ త‌మ గ్రాఫ్ పెరుగుతుంద‌ని నాయ‌కులు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు.

బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గంతోపాటు.. యువత కూడా.. రాధావైపు ఉన్నారు. ఇక‌, రంగా అభిమాన గ‌ణం.. ఆయ‌న‌తోనే ఉండ‌డం కూడా రాదా ప్రచారానికి హైలెట్‌గా మారింది. అయితే.. ఇది కూట‌మి అభ్య‌ర్థుల‌కు ఎంత వ‌ర‌కు మేలు చేస్తుంద‌నేది మాత్రం ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. బ‌ల‌మైన వాయిస్ లేక‌పోవ‌డం రాధాకు మైన‌స్‌. గ‌తంలోనూ బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌లేక పోయారు. అదేవిధంగా.. కౌంట‌ర్ ఎటాక్ చేయ‌డంలోనూ రాధా వెనుక‌బ‌డి ఉన్నారు. దీంతో స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఆయ‌న వెనుక‌బ‌డి ఉన్నారు. ఈ ఎఫెక్ట్ త‌ప్పిస్తే.. రంగా కుమారుడిగా ఆయ‌న ఇమేజ్ కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌కు ప‌నికి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News