హస్తినపై కన్నేసిన వీర్రాజు !

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానాన్ని ఆశించిన వీర్రాజుకు అవకాశం దక్కలేదు.

Update: 2024-06-30 04:55 GMT

సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు. మాజీ శాసనమండలి సభ్యుడు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానాన్ని ఆశించిన వీర్రాజుకు అవకాశం దక్కలేదు. ఆ సీటును అధిష్టానం పురంధేశ్వరికి కేటాయించింది. దీంతో అనారోగ్యం పేరుతో వీర్రాజు ఎన్నికల్లో సైలెంట్ అయిపోయాడు. రాజమండ్రిలో జరిగిన ప్రధానమంత్రి సభకు మాత్రం హాజరయ్యాడు.

వైసీపీకి దూరమై బీజేపీకి దగ్గరయిన నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణం రాజు నరసాపురం ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే తనకు రాజమండ్రి టికెట్ దక్కనందున తన సన్నిహితుడు శ్రీనివాసవర్మకు నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించుకున్నాడు. దీంతో చివరి నిమిషంలో రఘురామక్రిష్ణంరాజు ఉండి టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఎన్నికల్లో ఏపీలో కూటమి ఘనవిజయం అనంతరం వీర్రాజు మళ్లీ యాక్టివ్ అయ్యాడు. బీజేపీ నుండి గెలిచిన పురంధేశ్వరికి కేంద్రమంత్రి పదవి ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే వీర్రాజు పట్టుబట్టి తన మనిషి అయిన శ్రీనివాసవర్మకు ఇప్పించుకున్నాడని తెలుస్తుంది. సుధీర్ఘకాలంగా బీజేపీలో పనిచేస్తూ కీలక ఎన్నికల సమయంలో కనిపించకుండా పోయిన వీర్రాజు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్నత పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేపథ్యంలో నామినేటెడ్ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News