ఈ దెబ్బతో శాఖాహారులు మటాష్ ?

ఇక కొన్ని కీలక కులాలలో మొదటి నుంచి శాఖాహారం అన్నది ఒక ఆహార విధానంగా ఉంటూ వస్తోంది.

Update: 2024-09-23 03:54 GMT

ఈ దేశంలో ఎక్కువగా శాఖాహారులు ఉన్నారు. దాదాపుగా 143 కోట్ల మంది ప్రజానీకం ఉన్న భారత్ లో మూడవ వంతు దాకా శాఖాహారులు ఉన్నారని అధ్యయనాలు తెలియచేస్తున్నారు. వారంతా కనీసం కోడి గుడ్డు వైపు కూడా తొంగి చూడరు.

ఇక కొన్ని కీలక కులాలలో మొదటి నుంచి శాఖాహారం అన్నది ఒక ఆహార విధానంగా ఉంటూ వస్తోంది. వారు ఎక్కడికి వెళ్ళినా తాము శాఖాహారులమని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు. దానిని తరాలుగా ఆ కటుంబీకులు పాటిస్తూంటారు. అలా వారి రక్తంలో అనువంశీకంగా ఆ శాఖాహారం ప్రవహిస్తూ వస్తోంది.

కానీ అంతటి వారి ప్రాతివత్యాన్ని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న ప్రకటన ఒక్కసారిగా భంగం చేసిందా అన్న చర్చ వస్తోంది. ఇందులో సాధుసంతులు ముక్కు మూసుకుని తపస్సు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే ఆగమ శాస్త్రాలను పూర్తిగా వంటబట్టించుకుని జీవితాంతం దేవుడికే జీవితాన్ని అంకితం చేసిన వారు కూడా ఉన్నారు

వీరంతా తమ శాఖాహార జీవితం ఒక అద్భుతం అని దేవుడి ప్రసాదితమని భావిస్తూ ఉంటారు. ఇపుడు వారంతా దిగులు పడేలా ప్రకటన ఉంది. అది టీడీపీ కూటమి నుండి వచ్చింది. తాము విన్నది తప్పు కావాలని అలా జరిగి ఉండకూడదని వారు ఒకటికి వేయి సార్లు మొక్కుకున్నా అది నిజం అని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది.

ఒక్కసారి తప్పు కాదు ఏకంగా అయిదేళ్ళూ ఇదే తీరుగా సాగింది అని చెబుతోంది. దానికి అధారం ఏంటి అంటే జూలై 6 జూలై 12న వచ్చిన నాలుగు నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగిందని అందులో జంతువుల కొవ్వు కలిసింది అని నివేదికలు వచ్చాయని అంటోంది. ఇదే తీరుగా అయిదేళ్ళు జరిగి ఉండవచ్చునని ఎందుకంటే క్వాలిటీ టెస్ట్ అన్నది వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సరిగ్గా చేయించలేదని అంటోంది.

ఇక చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పిన మాటలు వింటే శాఖాహారుల వ్రతం అంతా పూర్గిగా గంగ పాలే అనిపించకమానదు. అదేంటి అంటే నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీ డీబీ ల్యాబ్ కు పంపిస్తే వచ్చిన రిపోర్టులలలో ఏకంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు చేప నూనె వంటివి నెయ్యిలో కలిసినట్లుగా ఉందని ప్రభుత్వం చెబుతోంది.

అంటే గడచిన అయిదేళ్ళ వైసీపీ ఏలుబడిలో ఒక్కసారి అయినా తిరుపతి వెళ్ళి లడ్డూ తిన్న వారు తెలియకుండానే వీటిని కూడా స్వీకరించారన్నదే దీని వెనక ఉన్న అర్ధం అని అంటున్నారు. మరి ఇలా ఇన్ని రకాల కొవ్వు కలసిపోయిన దాన్ని తిన్న వారు అంతా శాఖాహారులు ఎలా అవుతారు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

అయితే ఇక్కడ చర్చ అంతా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన టెస్టులలో ఇలా తేలింది కాబట్టి గతంలో జరిగి ఉండవచ్చు అన్న అంచానాల మేరకే. మరి దీని మీద ఆధారాలు అయితే లేవు అనే అంటున్నారు. ఎందుకంటే ఆ లడ్డూలు లేవు, ఆ తయారీ లేదు, ఆ నెయ్యి లేదు. అదంతా ఇపుడు ఎక్కడా కనిపించదు. మరి సిట్ విచారణలో అయినా గతంలో ఏమి జరిగింది అన్నది ఎంతో కొంత ఆధార సహితంగా వివరాలు బయటకు తెస్తే ఓకే. లేకపోతే మాత్రం అంచనాలు అనుమానాల మధ్య దేశంలోని శాఖాహారులు అంతా మటాష్ అనే అనుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. సో ఇదంతా పిటీగానే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News