కొత్త కోడ్ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో కాసుల వర్షం!

వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత అప్పటివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీని తీసుకురావటం తెలిసిందే

Update: 2024-03-19 04:52 GMT

వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత అప్పటివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీని తీసుకురావటం తెలిసిందే. ఈ కొత్త కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్లకు భారీ డిమాండ్ నెలకొంది. మొదటి పదివేల నెంబర్లకు ముందు ఎలాంటి ఎలాంటి సిరీస్ లేకపోవటం తెలిసిందే. కొత్త కోడ్ నేపథ్యంలో జిల్లా కోడ్ తర్వాత నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి తప్పించి.. ఏఏ.. ఏబీ.. ఏసీ లాంటిఅక్షరాలు లేకుండా ఉండటం తెలిసిందే. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం బడా బాబులు పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

కొత్త కోడ్ తెర మీదకు వచ్చిన వేళ.. ప్రతి జిల్లాలోనూ మొదటి 10 వేల నంబర్లకు సంబంధించిన వేలం వేశారు. శుక్ర.. శని.. సోమవారాల్లో నిర్వహించిన వేలానికి భారీ స్పందన లభించింది. ఈ నెల 18 వరకు నెంబర్ల వేలంతో రూ.4.29 కోట్లు రాగా.. వీటిల్లో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో రూ.2.05 కోట్లు రావటం గమనార్హం. అన్నీ ఆఫీసుల్లో టీజీ పేరుతో 0001తో సిరీస్ స్టార్ట్ అయ్యింది.

అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఖైరతాబాద్ ఆర్టీఏలో టీజీ09 0001 నెంబరుకు ఏకంగా రూ.9,61,111 ధర పలికింది. రంగారెడ్డి పరిధిలోని టీజీ07 0999 నెంబరును రూ.4.75 లక్షలు పెట్టి సొంతం చేసుకున్నారు. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటాపోటీ పడ్డారు. అధిక ధర పలికిన కొన్ని ఫ్యాన్సీ నెంబర్లను చూస్తే..

ఫ్యాన్సీ నెంబరు వేలంలో పలికిన ధర (రూ.లక్షల్లో)

టీజీ09 0001 9.61

టీజీ07 0999 4.75

టీజీ09 1111 3.73

టీజీ07 0369 2.90

టీజీ09 0909 2.30

టీజీ09 0005 2.21

టీజీ07 0009 1.91

టీజీ07 0099 1.69

టీజీ10 0099 1.60

టీజీ07 0707 1.56

టీజీ09 1122 1.54

టీజీ10 0009 1.50

Tags:    

Similar News