ఈ ఎంపీకి వైసీపీ ఇవ్వనిది.. టీడీపీ ఇచ్చింది!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.

Update: 2024-08-22 07:41 GMT

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. నెల్లూరు జిల్లాలో బడా కాంట్రాక్టరుగా, ఆర్థికంగా మంచి స్థితిమంతుడు అయిన ఆయన వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సతీమణి ప్రశాంతి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యురాలిగా పనిచేశారు.

ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో నెల్లూరు లోక్‌ సభకు వైసీపీ అధినేత జగన్‌.. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని ఎంపీగా ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాను సూచించిన అభ్యర్థులను పెట్టాలని వేమిరెడ్డి కోరారు. అయితే ఇందుకు జగన్‌ తిరస్కరించారని టాక్‌ నడిచింది. దీంతో తనకు అవమానం జరిగిందని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తన సతీమణి ప్రశాంతితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అలాగే ఆయన భార్య ప్రశాంతి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా టీడీపీలో వేమిరెడ్డికి మంచి గౌరవమర్యాదలు లభిస్తున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని.. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చాలా సంతోషంతో ఉన్నారని అంటున్నారు.

తాజాగా వేమిరెడ్డికి లోక్‌ సభలో పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీలో సభ్యుడిగా పదవి లభించింది. మొత్తం 15 మంది లోక్‌ సభ, రాజ్యసభ ఎంపీలను ఈ కమిటీలో నియమించగా అందులో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఈ మేరకు ఆయనను లోక్‌ సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా సభ్యుడిగా నియమించారు.

వాస్తవానికి వైసీపీ తరఫున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే వేమిరెడ్డి పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీలో సభ్యత్వాన్ని ఆశించారని అంటున్నారు. అయితే అప్పట్లో ఆయనకు ఈ పదవి రాకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆయన బాధపడ్డారని తెలుస్తోంది.

గతంలో వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని వేమిరెడ్డి.. జగన్‌ దృష్టికి తీసుకెళ్లి తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఈ విషయం తనకు తెలియదని.. తెలిస్తే ఇదేమంత పెద్ద విషయం కాదని.. తప్పకుండా పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీలో సభ్యుడిగా నియమించాలని సిఫార్సు చేసేవాడినని జగన్‌ చెప్పినట్టు సమాచారం.

ఏదేమైనా ౖÐð సీపీకి ఆర్థికంగా బ్యాక్‌ బోన్‌ గా నిలిచి వందల కోట్లు ఖర్చు పెట్టిన వేమిరెడ్డి అప్పట్లో పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీలో సభ్యత్వం సాధించలేకపోయినా ఇప్పుడు టీడీపీ సభ్యుడిగా పదవి సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:    

Similar News