భారం భగవంతుడిపై వేస్తున్న సాయిరెడ్డి... నెటిజన్ల ప్రశ్నల వర్షం ఇదే!

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు.

Update: 2024-09-20 09:27 GMT

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే సాయిరెడ్డి.. విజయవాడలో వరదలను ప్రస్థావిస్తూ.. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అంశన్ని లేవనెత్తుతూ.. ఏపీని భవంతుడే రక్షించాలని.. నారాయణుడి తలచుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవును... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి.. నా ఇళ్లు మునిగింది.. అయితే ఇప్పుడు ఏంటంట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు" అని మొదలుపెట్టిన సాయిరెడ్డి... మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేసేదానికి చాప కింద నీరులా పని చేసుకుంటూ పోతుందని తెలిపారు.

ఓ పక్క విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కార్ చాప కింద నీరులా పని చేసుకుంటూ పోతుంటే.. కృష్ణానది కరకట్టపై కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ విమర్శించారు. ఇదే సమయంలో... 40 ఏళ్ల ఇండస్ట్రీగా స్వీయ ప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారన్ని చేజిక్కించుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి అంటూ రాసుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే... ఆంధ్రరాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలని అన్నారు. దీంతో... ఈ ట్వీట్ పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఏపీలో ఇంకేమీ సమస్యలు లేవన్నట్లు... ఎప్పుడూ ఆ కరకట్ట నివాసం గురించి మాత్రమే మాట్లాడటం వల్ల ఏమిటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఆ కరకట్ట నివాసం కాదు.. పాలనే తమకు ముఖ్యమని ప్రజలు భావించారనే విషయం సాయిరెడ్డి గ్రహించాలని సూచిస్తున్నారు.

ఇదే సమయంలో ఆంధ్రరాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలని సాయిరెడ్డి కోరడం అంటే... చేతకానితనాన్ని అంగీకరించడమేనా..? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరుపున తాము పోరాడతామని.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అన్యాయం జరగకుండా తాము చూస్తామని భరోసా మాటలు మాట్లాడాల్సిన సాయిరెడ్డి.. ఇలా భగవంతుడిపై భారం వేయడం అంటే కాడి దింపేయడమేనా అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News