మై పార్టీ డ్యాష్ బోర్డు డాట్ కామ్ కథ ఏంటి ?
ఏపీ విపక్షంలో దొంగ ఓట్ల భాగోతానికి తెర తీసినట్లుగా వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏపీ విపక్షంలో దొంగ ఓట్ల భాగోతానికి తెర తీసినట్లుగా వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఆయన.. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పలు ప్రయత్నాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ కొత్త సంచలనానికి తెర తీశారు. పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్టును ఉల్లంఘిస్తూ ఎన్నికల సంగం డేటాను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ చేస్తున్న మాల్ ప్రాక్టీస్ ఉదంతాలను కేంద్ర ఎన్నికల సంఘం ముందుచారు. ఇంతకూ విజయసాయి రెడ్డి లేవనెత్తిన పాయింట్లను చూస్తే..
- మై పార్టీ డ్యాష్ బోర్డు డాట్ కామ్ పేరుతో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోంది. సెక్షన్ 123(3) పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్టును ఉల్లంఘిస్తోంది. ఓటర్ల కులాల వివరాల సేకరణ.. పొలిటికల్ పార్టీ ప్రాధాన్యతలపై టీడీపీ చేస్తున్న డేటా సేకరణను ఆధారాలతో సహా ఈసీకి తెలియజేశాం.
- మై పార్టీ డ్యాష్ బోర్డు డాట్ కామ్ లో ఓటరు పేరు.. ఊరు.. అడ్రస్.. జెండర్.. వయసు.. కులంతోపాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ పేరు.. మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరు చేయటం చట్టవిరుద్ధ చర్యగా మేం ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్లాం.
- టీడీపీ సేకరిస్తున్న ఈ డేటాను న్యూయార్క్ లోని ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ను గతంలోనూ తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించామని.. అప్పట్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
- మై పార్టీ డ్యాష్ బోర్డ్ డాట్ కామ్ ద్వారా తెలుగుదేశం చేపట్టిన చట్టవిరుద్ధమైన కార్యక్రమంపై 120(బి).. 379, 420, 188(ఐపీసీ)..72, 66(ఐటీఏ 2000యాక్ట్).. కింద చర్యలు తీసుకోవాలని కోరాం.
- మైపార్టీ డ్యాష్ బోర్డు డాట్ కామ్ ద్వారా సేకరించిన డేటాను న్యూయార్క్ సర్వర్ లో దాస్తుంటే.. టీడీపీ మ్యానిఫెస్టో డాట్ కామ్ వెబ్ సైట్ డేటా మొత్తాన్ని లండన్ లోని మరో సర్వర్ లో స్టోర్ చేస్తున్నారు.
- తాము సేకరించిన డేటాను ఎక్సెల్ ఫార్మెట్ లోకి మార్చి ప్రతి 30 మంది ఓటర్లకు తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్ కు అప్పగిస్తారు. అతను వారి ఇళ్లకు వెళ్లి.. ఒక ప్రభుత్వ ఉద్యోగిలా.. ఎన్నికల సంఘం సిబ్బంది మాదిరి తనకు కేటాయించిన 30 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కులం ఏంటి? వాళ్ల రాజకీయ గుర్తింపు ఏమిటి? వారు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు? వారు ఆరాధించే మతం ఏమిటి? లాంటి వివరాల్ని ఓటర్ల వ్యక్తిగత డేటాను సేకరించం చట్టవిరుద్ధం.
- 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో టీడీపీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు జరుగుతుందన్న లెక్కలు వేసి.. బాబు.. ష్యూరిటీ పేరుతో లెక్కలు వేస్తుననారు. దీనికి సంబంధించిన ప్రమాణపత్రాన్ని కార్డుల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఇలా 2.4లక్షల మందికి ఈ కార్డుల్ని అందజేసినట్లుగా మేం ఆధారాలతో సహా ఈసీ ముందుంచాం.
- ఓటర్లలో ఒకట్రెండు అక్షరాల్లో మార్పులు చేసి.. వారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లుగా పేర్కొంటూ ఓటర్లుగా చేర్పించే కార్యక్రమానికి తెలుగుదేశం తెర తీసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఏపీ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్ ప్రాక్టీస్ జరుగుతోంది.
- ఇప్పటికే దాదాపు 4.36 లక్షల ఓట్లను తెలంగాణ ఓటర్లను ఏపీలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో అక్కడున్న ఏపీ సెటిలర్స్ రేపటి ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ వ్యూహం పన్నింది. ఇదే విషయాన్ని ఈసీ ముందు పెట్టాం.
- తెలుగుదేశం పార్టీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అనే వ్యక్తి డూప్లికేటింగ్.. డబుల్ ఎట్రీస్.. నాన్ లోకల్ కింద ఏపీలో మొత్తం 10 లక్షల ఓట్లు ఉన్నట్లుగా మాకుతెలిసింది. వీటిపై విచారణ చేయాలని అడిగాం.