నీతి లేని చరిత్ర అంటూ చిన్నమ్మపై విజయసాయి!

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా ఏపీ అధికారపార్టీకి చెందిన కీలక నేతల్లో ఒకరు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.

Update: 2023-11-06 03:15 GMT

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా ఏపీ అధికారపార్టీకి చెందిన కీలక నేతల్లో ఒకరు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి. తీవ్రమైన వ్యాఖ్యలతో ఏపీ బీజేపీ మహిళా నేత.. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలుగుదేశం పార్టీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్లుగా విరుచుకుపడ్డారు.

ఎన్టీఆర్ ను అవమానపర్చిన కాంగ్రెస్ పార్టీలో నిస్సిగ్గుగా చేరిన ఆమె.. కేంద్రమంత్రిగా బాధ్యతల్ని నిర్వహించారంటూ గతాన్ని గుర్తు చేసిన విజయసాయి.. ఏపీ విభజన సమయంలో శకుని పాత్ర పోషించారన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టటంలో ఆమె తర్వాతే ఎవరైనా అన్నట్లుగా తీవ్ర స్థాయిలో సీరియస్ అయిన విజయసాయి.. ఘాటైన ట్వీట్లు చేశారు. ఓవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూనే.. మరోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగటం అనైతికమన్నారు విజయసాయి.

తండ్రిని కాంగ్రెస్ అవమానపరిస్తే.. ఆ అవమానాల పునాదులపై ఏర్పాటైన టీడీపీ పవర్లో ఉన్నంత కాలం.. ఆ పార్టీలో ఉన్న పురందేశ్వరి.. ఆ తర్వాత కాంగ్రెస్ లో నిస్సిగ్గుగా చేరారన్నారు. ఏపీని అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతల్ని నిర్వహించిన తీరును ఎండగడుతూ ట్వీట్లు చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ.. పురందేశ్వరి అంటూ విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News