బీజేపీకి వైసీపీ అవసరంపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైసీపీ కీలక నేత, విజయసాయిరెడ్డి.. పార్లమెంట్ లో వైసీపీ బలంపై స్పందించారు.

Update: 2024-06-12 13:55 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన దాడుల ఘటనలపై వైసీపీ సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇదే సమయంలో తాజాగా రాష్ట్రపతికీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైసీపీ కీలక నేత, విజయసాయిరెడ్డి.. పార్లమెంట్ లో వైసీపీ బలంపై స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ - వైసీపీ లకు అటు లోక్ సభ, ఇటు రాజ్యసభ లో ఉన్న బలాలను వివరిస్తూ... బీజేపీకి వైసీపీతో ఉన్న అవసరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు!

ఇందులో భాగంగా... పార్లమెంటులో టీడీపీ కంటే వైసీపీ ఏమీ తక్కువకాదన్నట్లుగా చెప్పిన సాయిరెడ్డి... పార్లమెంట్ లో వైసీపీకి 15 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. టీడీపీ 16 లోక్ సభ సీట్లుంటే... తమకు రాజ్యసభలో 11, లోక్ సభలో నాలుగు కలిపి మొత్తం 15 ఉన్నాయని అన్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ.. పార్లమెంట్ లో మాత్రం తమ బలం తగ్గలేదని అన్నారు.

ఈ క్రమంలోనే... రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి భారతీయ జనతాపార్టీకి.. వైసీపీ అవసరం ఉందని గుర్తించాలని.. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ఎన్డీయే ప్రవేశపెట్టే బిల్లులకు తమ మద్దతు ఉంటుందని అన్నారు.

కాగా... గత ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలు ఉన్న వైసీపీ సభ్యుల ఓటు ద్వారా రాజ్యసభకు 11 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో... మొత్తంగా 15 మంది ఎంపీలు వైసీపీ కలిగి ఉంది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకోగా.. 3 బీజేపీ, 2 జనసేన గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News