అంతా కలసి చీల్చుకున్నారు !

విశాఖ ఏజెన్సీ అంటేనే వైసీపీకి కంచు కోట లాంటిది. అటువంటిది ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోందా అన్న చర్చ సాగుతోంది

Update: 2024-05-15 02:45 GMT

విశాఖ ఏజెన్సీ అంటేనే వైసీపీకి కంచు కోట లాంటిది. అటువంటిది ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. గతంలో రెండు సార్లూ విశాఖ ఏజెన్సీ ఫ్యాన్ పార్టీకే పట్టం కట్టింది. కానీ ఈసారి చూస్తే కనుక ఫలితాలు తారు మారు అవుతాయా అన్న చర్చ సాగుతోంది.

చిరిగి చేట అయింది అన్నట్లుగా ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ నియోజకవర్గం అయిన అరకు లో రాజకీయం తయారు అయింది. వైసీపీ రెబెల్ టీడీపీ రెబెల్ తో పాటు బీజేపీ నుంచి కూటమి అభ్యర్ధి, వైసీపీ నుంచి మరో అభ్యర్ధి రంగంలో ఉన్నారు.

వీరంతా గిరిజనులలో ఒకే తెగకు చెందిన వారు కావడంతో ఓట్లు అన్నీ భారీగా వీరి మధ్యనే చీలిపోయాయని అంటున్నారు. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్లుగా సాగాల్సిన పోరు కాస్తా చతుర్ముఖ పోటీగా మారిపోయింది.

వీ నలుగురే కాకుండా కాంగ్రెస్ నుంచి కూడా మరో అభ్యర్ధి పోటీలో ఉన్నారు. వీరందరిలో ఎవరిని గిరిజనులు దయ తలచారు అన్నది తెలియరావడం లేదు. రెబెల్ అభ్యర్థులు బరిలో ఉండడంతో పాటు పోటీ కూడా గట్టిగానే ఇచ్చినట్లుగా పోలింగ్ సరళి తెలియచేస్తోంది.

వీటిని బేరీజు వేసుకుంటూ ప్రధాన పార్టీల అభ్యర్ధులు కలవరపడుతున్నారు. ఎవరు గెలిచిన కూడా మెజారిటీ స్వల్పమే వస్తుందన్న వార్తలు కూడా వైసీపీ టీడీపీ కూటములకు నిద్ర పట్ట నీయడంలేదు. తీరా చూస్తే అరకులో అరవై శాతం లోపే పోలింగ్ జరిగింది. ఈ తక్కువ పోలింగులో ఎక్కువ మంది అభ్యర్ధులు ఉండడం అంటే దెబ్బ ఎవరికి పడుతుంది అన్నది అర్ధం కావడం లేదు ట.

పాడేరులో చూస్తే టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వరి, వైసీపీ నుంచి మత్సరాస విశ్వేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా అభ్యర్ధిని పెట్టింది. 54 శాతం మాత్రమే పోలింగ్ జరిగిన పాడేరు లో రెండు ప్రధాన పార్టీలు గెలిచేది మేమే అంటున్నాయి. గతంలో వార్ వన్ సైడ్ గా సాగే ఏజెన్సీ ఈసారి ఫ్యాన్ రెక్కలు తిప్పుతుందా లేక సైకిల్ ఎక్కుతుందా అంటే పోలింగ్ సరళి కొంత అంతుబట్టడం లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News