జైల్లో 'ట్రిపుల్ ఆర్ ట్రీట్ మెంట్'... బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించే సమయంలోనూ గత విషయాలను గుర్తు చేసుకోంటూ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-15 05:38 GMT

సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రముఖులపై అసభ్యకర పోస్టులు, వారి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ తరహా కేసులు, పోలీసులను ప్రయోగించడాలు వంటి అంశాలపై చర్చలు నడుస్తున్నాయి.

ఈ సందర్భంగా పలువురు బాధితులు ఇప్పుడు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా విడదల రజనీపై ఫిర్యాదు చేశారు ఐ-టీడీపీ సభ్యులు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించే సమయంలోనూ గత విషయాలను గుర్తు చేసుకోంటూ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఆయనను అభినందిస్తూ గురువారం శాసనసభలో మాట్లాడారు బీజేపీకి చెందిన విశాఖ (ఉత్తరం) ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఆర్ పై రాజద్రోహం కేసు, తదనంతర పరిణామాలను ప్రస్థావించారు!

చంద్రబాబునాయుడు విశాఖపట్నం వస్తే ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారని.. ఆయనపై దాడులు చేయించారని.. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వస్తే అడ్డుకున్నారని చెబుతూ.. నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు విష్ణుకుమార్ రాజు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎవరినీ వైసీపీ పెద్దలు నాడు వదిలిపెట్టలేదని అన్నారు.

ఇక, ఎన్నికల సమయంలో విశాఖలో ఓ ఎమ్మెల్యేను విమర్శించినందుకు తనపైనా కేసులు పెట్టారని.. తాను కుండబద్దలు కొట్టేలా మాట్లాడే మనిషినని, భారతీయ జనతాపార్టీలో ఉన్నందుకు తప్పించుకోగలిగానని.. లేకుంటే రఘురామకృష్ణంరాజుకు ఇచ్చిన ట్రీట్ మెంట్ తనకూ తప్పేది కాదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

గతంలో.. అటు భౌతికంగానూ, ఇటు ఆర్థికంగానూ ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఇలా.. తాను బీజేపీలో లేకపోయి ఉంటే రాఘురామ కృష్ణంరాజు పరిస్థితే తనకూ వచ్చేది అంటూ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి!

Tags:    

Similar News