గన్‌ కల్చర్‌ పై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు!

మొత్తం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు.

Update: 2024-01-05 16:30 GMT

ఈ ఏడాది నవంబర్‌ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్‌లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ అమెరికన్లు కూడా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. వారిలో భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి ఒకరు.

అలాగే ఆయనతోపాటు నిక్కీ హీలీ, హిర్‌‡్ష వర్ధన్‌ సింగ్‌ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా పోటీలో ఉన్నారు. అయితే ట్రంప్‌ ను అనర్హుడిగా ఇప్పటికే రెండు కోర్టులు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వివేక్‌ రామస్వామి అత్యంత దూకుడుగా తన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే గడపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్‌ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నారు. తద్వారా రిపబ్లికన్‌ పార్టీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో గన్‌ కంట్రోల్‌ పాలసీపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్‌ కంట్రోల్‌ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందన్నారు. అలా కాకుండా అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్‌ రామస్వామి అభిప్రాయపడ్డారు.

అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీల మధ్య గన్‌ కంట్రోల్‌ పాలసీ తెరమీదకొచ్చింది. దీనిపై ఆయా పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా వివేక్‌ రామస్వామి గన్‌ కల్చర్‌ పై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఎక్కడైనా కాల్పుల సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్‌ చేస్తే సమస్య పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గన్‌ కంట్రోల్‌ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్‌ చర్య అన్నారు. గన్‌ కల్చర్‌ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైపోయిందన్నారు. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కాల్పులు ఘటనతో అయోవాలో వివేక్‌ రామస్వామి తన ప్రచారాన్ని చేపట్టలేదు.

Tags:    

Similar News