రాజకీయాలకు రాం రాం !
ఒడిశాలో మాజీ ఐఏఎస్ అధికారి, బిజూ జనతాదళ్ నాయకుడు వీకే పాండ్యన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు
ఒడిశాలో మాజీ ఐఏఎస్ అధికారి, బిజూ జనతాదళ్ నాయకుడు వీకే పాండ్యన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు.
ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, నా ఈ రాజకీయ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అలాగే తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం బీజేడీ ఓటమిలో పాత్ర పోషించి ఉంటే అందుకు కూడా ప్రజలు, బీజేడీ కార్యకర్తలు తనను క్షమించాలని పాండ్యన్ కోరారు.
కాగా, పాండ్యన్‌పై వస్తున్న విమర్శలు దురదృష్టకరమని నవీన్ పట్నాయక్ తన సన్నిహితుడిని వెనకేసుకొచ్చారు. పాండ్యన్ తన వారసుడు కాదని, తన వారసుడిని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని నవీన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పట్నాయక్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పాండ్యన్ ప్రకటించిన పాండ్యన్ అన్న మాట ప్రకారం నిలబడ్డాడు. రాజకీయాల్లోకి వచ్చిన 6 నెలల 14 రోజుల్లో గుడ్ బై చెప్పాల్సి రావడం విశేషం.