"ఎక్కడ చదివామన్నది కాదు"... చెవిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే కూతురు క్లాస్!

అవును... తన కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్ట్ పై చెవిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుకు పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి స్పందించారు.

Update: 2024-07-29 12:09 GMT

ప్రస్తుతం ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని.. వైసీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ అధినేత నుంచి నాయకుల వరకూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుమారుడిపై కూడా ఇలా కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారంటూ చెవిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

ఇందులో భాగంగా... తన కొడుకు వయసు 25 ఏళ్లు అని.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యషించి ప్రజా జీవితంలోకి వచ్చాడని మొదలుపెట్టిన చెవిరెడ్డి.. అతడిని అక్రమ కేసులో అరెస్ట్ చేయించారని అన్నారు. ఇదే సమయంలో... విదేశాల్లో చదివిన తన కుమారుడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని.. అందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు అని చెవిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇదే సమయంలో... తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడినని.. అంతకు మించి తన కుమారుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడని.. ప్రజల పక్షాన ఏ స్థాయిలో పోరాటానికైనా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి తెలిపారు. ఈ ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్యే కూతురు రియాక్ట్ అయ్యారు.

అవును... తన కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్ట్ పై చెవిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుకు పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి స్పందించారు. ఇందులో భాగంగా... మూడేళ్ల క్రితం తన 23 ఏళ్ల వయసులో వైసీపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల్లో భాగంగా తన తండ్రిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... తమ విలువలను నిరూపించుకోవడానికి విదేశీ డిగ్రీలను ప్రదర్శించాల్సిన అవసరం తమకు లేదని మొదలుపెట్టిన వైదీప్తి... ఎక్కడ చదువుతున్నామనేదాని గురించి కాదు.. మనం సమర్థించే విలువల గురించి మాత్రమే ఇది అన్నారు. ఇక, గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అనుభవించిన బాధను మీరు ఈ సందర్భంగా గ్రహించారని తాను నమ్ముతున్నట్లు తెలిపారు!

కాగా... ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడికి (41ఏ) కింద స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఈ సమయంలోనే అతని తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆగ్రహాన్ని ఎక్స్ లో వ్యక్తం చేశారు. దీనికి వైదీప్తి ఇలా రియాక్ట్ అయ్యారు!

Tags:    

Similar News