ప్రజారాజ్యం విలీనం టైం లో పవన్ మైనరా..?
యథా రాజా తథా ప్రజా అంటారు. అధినేత ఎలా అస్థిరంగా మాట్లాడతారో
యథా రాజా తథా ప్రజా అంటారు. అధినేత ఎలా అస్థిరంగా మాట్లాడతారో.. మరెంత అస్పష్టంగా స్పందిస్తారో.. వెనకున్న చోటామోటా నేతలు, కార్యకర్తలు కూడా అలానే మాట్లాడే ఛాన్స్ ఉంటుందని దానర్ధం అవ్వొచ్చు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా “చిరంజీవి ప్రజారాజ్యం విలీనం”అంశంపై కొత్త చర్చ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.
అవును... తాజాగా కొంతమంది చేసిన వ్యాఖ్యలు, అందుకు వచ్చిన వివరణ, అందుకు మరికొంతమంది చేసిన కవరింగు మాటలు ఇప్పుడు జనసేనలోనే కాదు.. మెగా ఫ్యాన్స్ మధ్య కూడా హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. జనసేన నేతల వ్యాఖ్యల ఫుల్ వెర్షన్ విన్నవారు ఒకరకంగా స్పందిస్తుంటే... సగం విని ఒక నిర్ణయానికి వచ్చినవారు ఫైరవుతున్నారని తెలుస్తుంది.
అయితే సగం విన్నా.. పూర్తిగా విన్నా.. చిరంజీవి పేరు ప్రస్థావిస్తూ అన్నట్లు వస్తోన్న వార్తలు మాత్రం వాస్తవం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం! తర్వాత చిరంజీవి గురించి ఇచ్చిన కన్ క్లూజన్ కూడా వారు పలికిన మాటలే అనేది కూడా ప్రధానం. అయితే... అవి నష్టనివారణా చర్యల్లో భాగంగా.. తడబడకుండా చేసిన ప్రయత్నంగా చూసేవారు కూడా లేకపోలేదని అంటున్నారు.
"చిరంజీవి రాజకీయంగా ఓటమిపాలైనప్పటికీ.. పవన్ కళ్యాణ్ ధైర్యంగా పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం కేడర్ ను ఒకర్నంటే ఒకర్ని కూడా తనతో కలిసి పని చేయాలని అడగలేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినట్లు అవుతుంది గానీ.. తప్పనిసరి పరిస్థితి ఇది. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కు ఫెయిల్యూర్ పాత్ వేశారు" అంటూ కొంతమంది వ్యాఖ్యానించారని తెలుస్తుంది. ఇది సోషల్ మీడియాలో వినిపిస్తున్న వేర్షన్!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... "చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఉంటుంది" అన్నారంటే.. ఫుల్ క్లారిటీతోనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు పరిశీలకులు. పైగా "ఇది తప్పనిసరి పరిస్థితి" అని నొక్కి వక్కానించిన విషయాన్ని ఇక్కడ నొక్కి చెబుతున్నారు. దీంతో... రాజకీయంగా పవన్ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రస్థావించాలంటే... నేడు పవన్ ను జనాలు నమ్మడం లేదు అని బాదనిపిస్తుంటే... తప్పని పరిస్థితుల్లో చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడాలా? అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి గురించి, పవన్ కల్యాణ్ గురించి అద్భుతంగానే కన్ క్లూజన్ ఇచ్చి ఉండొచ్చు.. వచ్చి ఉండొచ్చు. వారి వారి అభిమానాన్ని ఆ స్థాయిలో వ్యక్తం చేసి ఉండొచ్చు. అయితే... అందుకు చిరంజీవి ప్రజారాజ్యం విలీనాన్ని ప్రస్థావించాల్సిన అవసరం లేదనేది పలువురి అభిప్రాయంగా ఉంది. కారణం... ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లో కలిపే సమయానికి పవన్ కల్యాణ్ ఏమీ మైనర్ కాదు, పసి వాడు కాదు, ఆయనకు ఊహతెలియని సమయంలో జరిగిన సంఘటన అంతకన్నా కాదు అనేది గ్రహించాలని సూచిస్తున్నారు!
ఇదే విషయాన్ని ఆన్ లైన్ వేదికగా గుర్తు చేస్తున్నారంట మెగా అభిమానులు. పవన్ అభిమానులు, చిరంజీవి అభిమానులు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండరు.. అంతా మెగా ఫ్యామిలీయే అనే విషయం ఎవరు మరిచిపోయినా... జనసేన అధికార ప్రతినిధులు అనిచెప్పుకునేవారు, ఆ పార్టీకోసం మైకుల ముందు మాట్లాడేవారు అస్సలు మరిచిపోకూడదని అంటున్నారు. దానివల్ల చిరంజీవికి వచ్చిన నష్టం ఏమీ లేదనే విషయం గ్రహించాలని సూచిస్తున్నారు.
నాడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తున్నప్పుడు.. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ఏమైనా అడ్డు చెప్పారా... అంగీకరించారా... లేక, లైట్ తీసుకున్నారా.. అనే విషయంపై క్లారిటీ లేకుండా... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరైన చర్య కాదని.. ఒక వేళ అది రాజకీయ వ్యూహంలో భాగమైతే... అది సరైన వ్యూహం కాదని అంటున్నారంట పరిశీలకులు. ఫలితంగా జనసేనకు జరిగే డ్యామేజీ కాస్త ఎక్కువగానే ఉండొచ్చని సూచిస్తున్నారంట.
దీంతో సోషల్ మీడియా కాలంలో... ప్రతీ ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నంలో... “పార్టీ పెట్టి పదేళ్లయినా కూడా ఇంకా చిరంజీవి ప్రజారాజ్యం గురించిన ప్రస్థావనేనా..?” అనే కామెంట్లు కనిపించే ప్రమాధం ఉందని అంటున్నారు. ఫలితంగా మెగాభిమానుల మధ్య చీలిక వచ్చే సమస్య ఉందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. దీనివల్ల చిరంజీవికి వచ్చే నష్టం ఏమైనా ఉందా? అని జనసేన నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా జనసేన నాయకులు అన్నారని చెబుతున్న మాటలు ముందువా, వెనకవా అనే విషయం పక్కనపెడితే... ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు ఫుల్ గా వైరల్ అయిపోయాయి. దీంతో ఇప్పటికే కొంతమంది మెగాభిమానులు... "మా అన్నయ్యకు విలీనం చేయడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు.. మీకు అధినేత కూడా ఎమ్మెల్యే కాదుగా"... "ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుగా.. మీకు గెలవడం చేతగాక మా అన్నయ్యను అంటారా" అంటూ ఇప్పటికే ఆన్ లైన్ వేదికగా కౌంటర్స్ వేసేస్తున్నారని తెలుస్తుంది.
పైగా ఈ విషయాలపై నాగబాబు స్పందన కూడా వైరల్ అవుతుందని అంటున్నారు. చిరుపై వ్యాఖ్యల వ్యవహారంపై స్పందించిన నాగబాబు... "లీవిట్.. వదిలేయండమ్మా.. ఆమె తెలిసీ తెలీకుండా ఫ్లోలో అలా అనేసింది.. మొదటి నుంచి పార్టీలో ఉన్న మహిళా.. పట్టించుకోకండి" అని శాంతపర్చారని తెలుస్తుంది. దీంతో.. “ఫ్లో లో అంటే పర్లేదు.. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ప్లాన్ ప్రకారం అంటేనే ప్రోబ్లం” అనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
ఇక్కడ ఎవరైనా గమనించాల్సిన విషయం ఏమిటంటే... నాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి... పవన్ పార్టీపెట్టి చంద్రబాబు - మోడీ ధ్వయానికి మద్దతు ఇవ్వడానికి, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తాను అని చెప్పడానికీ ఏమిటి సంబంధం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్న విషయం మరిచిపోకూడదని అంటున్నారు పరిశీలకులు.
ఏది ఏమైనా... జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. వెనకా ముందూ చూడకుండా.. ప్రత్యర్ధులకు అవాకాశం ఇచ్చేలా మాట్లాడితే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పటికే కొంతమందికి టీకా తాత్పర్యాలతో సహా అర్ధం అయ్యి ఉంటుంది.. వారి అనుభవాన్ని జనసేన ఇతర నాయకులు పరిగణలోకి తీసుకుంటే ముందు ముందు ప్రభవాలు తగ్గుతాయి.. ఆలాకానిపక్షంలో కంట్రోల్ చేయలేని స్థాయిలో డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారంట పరిశీలకులు!