రాసుకున్న లీడర్స్ తో కలిస్తే ఏమి లాభం జగన్ ?

వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో బలపడాలీ అంటే జనంలో పలుకుబడి ఉన్న నేతలతో కూర్చుని జగన్ మాట్లాడాలీ అని పార్టీలో వినిపిస్తున్న మాట. అలా ప్రజలలో మమేకమైన వారికే అన్ని విషయాలూ తెలుస్తాయని అదే పార్టీకి పెద్ద బలం అవుతుందని అంటున్నారు.

Update: 2024-12-11 07:34 GMT

వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో బలపడాలీ అంటే జనంలో పలుకుబడి ఉన్న నేతలతో కూర్చుని జగన్ మాట్లాడాలీ అని పార్టీలో వినిపిస్తున్న మాట. అలా ప్రజలలో మమేకమైన వారికే అన్ని విషయాలూ తెలుస్తాయని అదే పార్టీకి పెద్ద బలం అవుతుందని అంటున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం స్థానిక సంస్థలలో గెలిచిన తమ పార్టీ వారితే భేటీలు పెడుతోంది.

సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా వీరిని మాత్రమే జగన్ కలుస్తున్నారు. అయితే వీరంతా జన బలంతో గెలిచిన వారేనా అన్నదే ఇక్కడ చర్చ. 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు ఇలా అందరూ వైసీపీ నుంచే గెలిచారు.

ఒక విధంగా అధికారం చేతిలో ఉండబట్టి ఆ ఎన్నిక ఏకపక్షమైంది. ఎంతలా అంటే పార్టీ వారు తమకు అనుకూలమైన వారి పేర్లు రాసుకుని మరీ వారినే అలా నామినేషన్ వేయించి సీట్లో కూర్చోబెట్టేలా కధ సాగింది. అంటే అలా గెలిచిన వారిలో అత్యధికులు ప్రజలతో పెద్దగా కనెక్షన్ ఉన్న వారు కాదని అంటున్నారు.

అందువల్ల వారు తమను అలా పదవి ఇచ్చారు కూర్చోబెట్టారు అని మాత్రమే భావిస్తూ వచ్చారు. నిజంగా వారికే అంత బలం ఉంటే నూటికి 95 శాతం స్థానిక సంస్థలు వైసీపీ చేతిలో ఉంటే 2024 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు దారుణంగా ఓటమి పాలు అవుతుంది అన్న ప్రశ్నలు వస్తున్నారు.

ఒకవేళ ఓడినా మరీ డిజాస్టర్ రిజల్ట్ మాదిరిగా 11 సీట్లే ఎందుకు వస్తాయని కూడా అంటున్నారు. అంటే ఈ గెలిచిన వారు ఎవరూ జనంలో పెద్దగా పలుకుబడి కలిగిన వారు కారనే కదా దీని అర్ధం అని అంటున్నారు. అలా వైసీపీకి 2024 ఎన్నికల్లో లిట్మస్ టెస్ట్ కాదు అసలైన టెస్ట్ నే చూపించిన తరువాత మళ్లీ వారిని దగ్గరకు తీసి 2029 ఎన్నికల కోసం యాక్షన్ ప్లాన్ అంటూ వైసీపీ అధినాయకత్వం హడావుడి చేస్తే లాభమేంటి అని అంటున్నారు. నిజంగా ప్రజలలో ఉన్న వారిని పట్టుకుని వారితోనే భేటీలు వేయాల్సి ఉంటుందని అంటున్నారు.

అలా జరిగిన నాడే వైసీపీ గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళినట్లు అని అంటున్నారు. అంతే తప్ప కేవలం పదవులు ఉన్నాయన్న కారణంగా వారిని మాత్రమే దగ్గరకు రానిచ్చి వారితోనే అంతా అన్నట్లుగా మీటింగులు పెడితే మాత్రం చివరికి వైసీపీకి ఆయాసమే తప్ప మిగిలేది ఏముంది అని అంటున్నారు.

ఇప్పటికైనా వైసీపీ పోయిన చోట వెతుక్కునే దానికి రెడీ కావాలని అంటున్నారు. అంటే బలమైన క్యాడరే పార్టీ పట్ల నిరాశగా ఉంటోంది. అందువల్ల అలా దూరం అయిన వారిని దగ్గరకు తీయడం వారితోనే పార్టీని బలోపేతం చేయడం అన్న దాని మీద దృష్టి పెట్టాలని అంటున్నారు.

అధికారంలో ఉన్నపుడు వైసీపీ చాలా మిస్ అయిందని ఇపుడు అవే శాపాలుగా మారుతున్నాయని అంటున్నారు. పదవులు ఇచ్చేటపుడు కూడా కష్టపడిన వారికి ఇవ్వకుండా తమ అనుచరులకు వందిమాగదులకు కట్టబెట్టి పార్టీ నేతలు చిత్తం వచ్చిన తీరుగా వ్యవహరించారని దాని వల్లనే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి ఏమీ ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు.

అలా అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలు అన్న సిద్ధాంతం అమలు చేయడం వల్లనే వైసీపీ రెండిందాల చెడిందని అంటున్నారు. పదవులు దక్కించుకున్న వారితో పెద్దగా లాభం లేదు, దక్కని వారు సైలెంట్ అయ్యారు. ఈ తీరునే గమనించి ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే మాత్రం వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు.

Tags:    

Similar News