కౌంటింగ్ రోజు ఏమి జరగబోతోంది ?

ఇదిలా ఉంటే కౌంటింగ్ రోజు ఏమి జరుగుతుంది అన్న టెన్షన్ ఉంది.

Update: 2024-06-02 13:49 GMT

కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. మధ్యలో ఒక్క రోజు గడిస్తే చాలు జూన్ 4 వచ్చేస్తుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ఇక ట్రెండ్స్ రావడం మొదలు అవుతాయి. సరిగ్గా గంట గంటన్నరలో ఒక అంచనాకు అయితే రావడం జరుగుతుంది.

ఇదిలా ఉంటే కౌంటింగ్ రోజు ఏమి జరుగుతుంది అన్న టెన్షన్ ఉంది. ఈ టెన్షన్ ని ప్రధాన రాజకీయ పార్టీలే కలుగజేస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ తరఫున కౌంటింగ్ ఏజెంట్లకు దిశా నిర్దేశం చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో చంద్రబాబు పీహెచ్ డీ చేశారని అందువల్ల ఆయన కౌంటింగ్ దగ్గర తన వారిని ముందు పెట్టి ఏమైనా చేయగలరని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రెచ్చగొట్టినా సహనంతో ముందుకు సాగాలని అధికారులకే ఏ విషయం అయినా ఫిర్యాదు చేసి ప్రతీ ఓటూ లెక్కలోకి తీసుకునేలా చేసుకోవాలని సూచించారు

ఇక చంద్రబాబు కూడా ఇదే రకమైన డౌట్ నే వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు ఉన్నారని, వారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు దిగే చాన్స్ ఉందని ఆయన చెబుతున్నారు అందువల్ల టీడీపీ క్యాడర్ అంతా అలెర్ట్ గా ఉండాలని సాఫీగా ప్రశాంతంగా కౌంటింగ్ జరిపించేలా చూడాలని బాబు కోరారు.

ఇలా రెండు వైపుల నుంచి అవతల పక్షం ఘర్షణలు చేస్తుందని డౌటానుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవి అనుమానాలు కావు అని చెప్పడానికి పోలింగ్ రోజున జరిగిన పల్నాడు తిరుపతి, తాడిపత్రి వంటి ఘటనలు ఉన్నాయి. ఈసారి కూడా అలాంటివి జరిగే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు అని అంటున్నారు

ఈసీ అయితే గట్టి బందోబస్తునే ఏర్పాటు చేసింది. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద అతి పెద్ద భద్రతా వలయమే ఉంచింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఎవరైనా రూల్స్ ని అతిక్రమిస్తే ఇక రెండవ మాట లేకుండా అరెస్ట్ చేసి జైలుకే పంపేలా ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఏపీలో ఈసారి డూ ఆర్ డై అన్నట్లుగానే ఎన్నికలు జరిగాయి. కాబట్టి ప్రతీ అంశం వద్దా అటూ ఇటూ పట్టుగానే ఉంటున్నారు. గెలుపు తమ వైపే ఉండాలని అన్న దానితోనే ఒకటికి వంద సార్లు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

పోలింగ్ అయితే ప్రజలతో సంబంధం ఉంటుంది కాబట్టి గొడవలు అయితే జనాలు భయపడతారు. కొన్ని సందర్భాలలో గాయాలు అవుతాయన్న ఆందోళన ఉంటుంది. అయితే కౌంటింగ్ కాబట్టి జనాలు ఇంట్లో కూర్చునే అంతా టీవీలలో చూస్తారు. కానీ అధికారులకు మాత్రం అగ్ని పరీక్ష లాగానే ఉంటుంది అని అంటున్నారు. ఈసారి కౌంటింగ్ కి డ్యూటీల మీద వెళ్తున్న వారు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు. అలాగే జరగాలని సాఫీగా ఈ కార్యక్రమం పూర్తి కావాలని ఏపీలోని కోట్లాది జనమూ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News