జ‌గ‌న్‌ను మ‌రింత డైల్యూట్ చేస్తారా చంద్ర‌బాబు వ్యూహం ఏంటి..?

కానీ దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు బడ్జెట్ సమావేశాల పేరుతో కొత్త సాంప్రదాయానికి తెర తీశారు.

Update: 2024-07-28 13:30 GMT

అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే ఎక్కడా కూడా బడ్జెట్ కి సంబంధించిన కనిపించలేదు కేవలం గత వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేయటం శ్వేత పత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డిని మరింతగా బలహీన పరచటం దిశ‌గానే సాగింది. ఆయనపై అంతో ఇంతో ఉన్న సానుభూతిని కూడా లేకుండా చేయాలి.. అనే పక్కా వ్యూహంతో ఈసారి ఈ సమావేశాలు సాగాయి. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు అంటే రాబోయే ఏడు మాసాల కాలానికి బడ్జెట్ను ప్రవేశ పెట్టడం దానిలో కేటాయింపులు ఇతర పథకాలు వంటి వాటిని చర్చించడం సాధారణంగా జరుగుతుంది.

కానీ దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు బడ్జెట్ సమావేశాల పేరుతో కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా బడ్జెట్ సమావేశాలు పేరుతో శాశ్వత పత్రాలపై చర్చించిన దాఖలా లేదు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలా జరిగింది. పోనీ ఎక్కడైనా సరైన విధంగా జగన్ వైపు తప్పులు ఎత్తి చూపించారా ? అంటే అనేకమైన విషయాలను దాచి పెట్టారనే చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకు లిక్కర్ విషయాన్ని తీసుకుంటే ఆదాయం తగ్గిందని సుమారు 18 వేల కోట్ల రూపాయలు ఆదాయం మధ్యలో పడిపోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అదే విధంగా లిక్కర్ దుకాణాల సంఖ్య కూడా 2019లో 2020లో పోల్చి చూసినప్పుడు సుమారు 30 వేల లెక్కల దుకాణాలు లేపేశార‌ని అన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. వాస్తవానికి ఇది మంచి పరిణామం కదా లిక్కర్ ఆదాయం తగ్గింది అంటే తాగేవాళ్లను తగ్గించారని అనుకోవాలి. అదే సమయంలో లిక్కర్ ఆదాయం తగ్గింది. అంటే తాగే వాళ్ళ సంఖ్య తగ్గిందని లెక్క కదా. కానీ, ఈ విషయాలను దాచిపెట్టి తెలంగాణతో పోల్చారు.

తెలంగాణలో వస్తున్న దానికంటే ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఆదాయం తగ్గిపోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవానికి 2014 నుంచి 2019 మధ్య జరిగిన చంద్రబాబు పాల‌న‌తో పోల్చి అప్పటికి ఇప్పటికి మద్యం ఆదాయం తగ్గిందా పెరిగిందా అని చెప్పి ఉండాలి అలా చేయకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చి మద్యాన్ని చెప్పుకొచ్చారు. ఇలా చూసుకున్న మద్యం ఆదాయం తగ్గింది. మద్యం అమ్మే దుకాణాలు తగ్గాయి. బెల్టు షాపులు తగ్గి, రాష్ట్రంలో కాబట్టి రాష్ట్రంలో మద్యం తాగే వారి సంఖ్య కూడా తగ్గినట్టే భావించాలి. ఇది మంచి పరిణామం.

కానీ ఇక్కడ వాస్తవాలను దాచేసి మద్యం ఎందుకు అమ్మ లేకపోయారు అనే ఒక విపత్కర ప్రశ్నను తెర మీదకు తెచ్చారు. ఆర్థిక పరిస్థితిని గమనిస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేశారని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అందరూ నిజమే అని అనుకునేలా అటు పత్రికలు అప్పటి విపక్షాలు కూడా చెప్పాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్వేత‌ప‌త్రాన్ని అసెంబ్లీలో విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం నిజాలను ఒప్పుకోవాల్సి వచ్చింది.

దీనిని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కేవలం ఐదు లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని అసెంబ్లీలో ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే స్పష్టమైనది. 2019 వరకు మూడు లక్షల 75 వేల కోట్ల రూపాయలు ఉన్న అప్పు.. 2024 జూన్ 30వ తారీకు నాటికి తొమ్మిది లక్షల 74 వేల కోట్ల రూపాయలకు చేరాయి అని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తొమ్మిది లక్షల 74 వేల కోట్లలో చంద్రబాబు హయాంలో చేసిన మూడు లక్షల 75 వేల కోట్ల రూపాయలు తీసేస్తే మిగిలిన మొత్తం మాత్రమే 2019 - 2024 మధ్య జగన్ చేసిన అప్పులు ఎంత అనేది స్పష్టం అవుతాయి.

ఇలా చూసుకుంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే జగన్ అప్పు చేశారు. ఈ విషయాన్ని గ‌తంలో కేంద్రం కూడా చెప్పింది. పదే పదే పార్లమెంట్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేకమంది ఏపీ చేసిన అప్పులపై ప్రశ్నించినప్పుడు నాలుగు లక్షల 23 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఏపీ ప్రభుత్వం అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇతర మంత్రులు సైతం పార్లమెంట్లో చెప్పారు. దీనిని అప్పట్లో ఎవరు ప్రచారం చేయలేదు. 14 లక్షల కోట్లు రూపాయలు అప్పులు చేశారని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాస్తవాలు గమనిస్తే అసెంబ్లీ వేదికగా చెప్పిన అప్పు ఐదు లక్షల పదివేల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు చేశారని తేలింది.

ఈ రెండు విషయాలు కూడా ఈ శ్వేత పత్రాలు వెనుక దాగి ఉన్న అసలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చాయి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఎదురు దాడి చేయడం.. ఏదో జరిగిపోయింది అని చెప్పటం స్పష్టంగా కనిపించింది. మొత్తంగా చూస్తే శ్వేత‌ పత్రాల విడుదల ద్వారా సాధారణ ప్రజలకు అర్థం కాకుండా చెప్పినప్ప‌టికీ.. మేధావులు ఆర్థిక నిపుణులు కాస్తోకూస్తో చదువుకున్న వారికి జగన్ హయాంలో ఏం జరిగిందో అర్థ‌మైంది. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్‌ను మ‌రింత డైల్యూట్ చేసే ప్ర‌య‌త్నం అయితే జ‌రిగిపోయింది.

Tags:    

Similar News