వాట్సప్‌ లో కొత్త ఫీచర్‌.. వాయిస్ మెసేజ్ వినే పనేలేదు!

టెక్నాలజీ ప్రపంచంలో రెగ్యులర్ గా అప్ డేట్ అనేది చాలా కీలకం అని అంటారు

Update: 2024-07-13 09:30 GMT

టెక్నాలజీ ప్రపంచంలో రెగ్యులర్ గా అప్ డేట్ అనేది చాలా కీలకం అని అంటారు. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ కాని పక్షంలో... కాంపెటీషన్ తట్టుకోలేక కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతుంటారు. అందువల్లే... ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా పూర్తి ఫేమస్ అయిన పలు కంపెనీలు నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరిస్తూ అట్టిపెట్టుకుంటాయి.

ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ రావడం అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని తెరపైకి తెస్తూ వినియోగదారులను స్థిరపరుచుకోవడం కీలకం. ఈ నేపథ్యంలో... తాజాగా వాట్సప్ ఒక కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది. ఇదొక ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్. అంటే... వాయిస్ మెసేజ్ లను వినే అవకాశం లేనప్పుడు టెక్స్ట్ రూపంలో మార్చి వదువుకునేలా చూపిస్తుందన్నమాట.

అవును... వాట్సప్ లో ఈ సరికొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఇయర్ ఫోన్స్ అందుబాటులో లేనప్పుడు, వాయిస్ మెసేజ్ ఓపెన్ గా వినే సౌకర్యం లేనప్పుడు, ఆ వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ రూపంలో అందించే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది వాట్సప్. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ప్రస్తుతం ఈ ఫీచర్ తారసపడింది.

ఇందులో భాగంగా... వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు లేదా పంపినప్పుడు అ మెసేజ్ కింద ఈ ట్రాన్స్ స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అందులోని సందేశం యథావిధిగా టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లిష్, హిందీ, స్పానిష్, రష్యన్, పోర్చుగీస్ భాషలకు సపోర్ట్ చేస్తోంది. గతంలో ఐఓఎస్ బీటా యూజర్లకు కూడా ఇదే తరహా ఫీచర్ కనిపించింది.

అయితే ఇది ట్రాన్స్ లేటర్ మాత్రం కాదు. ఆ వాయిస్ మెసేజ్ ఏ భాషలో ఉంటుందో ఆ వాయిస్ కి అదే భాషలో అక్షరూపాన్ని మాత్రమే ఇస్తుంది. సాధారణ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News