యూఎస్ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ శక్తిగా ఇండియన్స్... ఎంతలా అంటే..?

జరిగేది అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయినప్పటికీ... ఇది అగ్రరాజ్యం కావడంతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోని ఇది చర్చనీయాంశంగా ఉంది!

Update: 2024-10-19 04:33 GMT

జరిగేది అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయినప్పటికీ... ఇది అగ్రరాజ్యం కావడంతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోని ఇది చర్చనీయాంశంగా ఉంది! ఇక భారత్ లో సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాతో భారత్ కున్న బంధం అలాంటిది మరి! ఈ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా భారతీయులు పోషిస్తున్న కీలక పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... సుమారు 161 మిలియన్లకు పైగా ఉన్న బలమైన యూఎస్ ఓటర్లలో ఓ చిన్నభాగం మాత్రమే అయిన 2.1 మిలియన్ల భారతీయ అమెరికన్ ఓటర్లు.. ఆ దేశ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ శక్తిగా ఎదుగారు.. ఎదుగుతూనే ఉన్నారు! ఈ సమయంలో భారత మూలాలున్న కమలా హారిస్ తో ప్రెసిడెన్షియల్ బ్యాలెట్ లో వీరి సంఘం కీలక భూమిక పోషిస్తోందని అంటున్నారు.

అమెరికాలో విద్యావంతులు, సంపన్న సమూహంగా తమను తాము స్థాపించుకున్న భారతీయ అమెరికన్లు... కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా.. అభ్యర్థులుగా, క్రౌడ్ పుల్లర్లుగా, నిధుల సమీకరణదారులుగా కూడా బలంగా మారుతున్నారని అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు డెమోక్రాటిక్ నేషనల్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు అజయ్ భుటోరియా.

ఇందులో భాగంగా.. ఎప్పటిలాగానే ఎక్కువ మంది ప్రజలు ముందుకు వస్తున్నారని. అయితే ఈ సమయంలో పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ, రాజకీయ ప్రక్రియలో మరింత చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా... భారతీయ అమెరికన్ కుటుంబాల మధ్యస్థ ఆదాయం 1,45,000 డాలర్లుగా ఉందని.. యూఎస్ మధ్యస్థ ఆదాయం కంటే ఇది 21% ఎక్కువని అంటున్నారు.

ఇదే సమయంలో... ఆసియా అమెరికన్ డయాస్పోరార్లో అతిపెద్ద సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అయిన ఏఏపీఐ విక్టరీ ఫండ్ వ్యవస్థాపకుడు శేఖర్ నరసింహన్ స్పందిస్తూ... భారతీయ అమెరికన్లు ఎన్నికల ప్రచారానికి ఎంత ఆర్థీ సాయం చేస్తున్నారో కచ్చితమైన డేటాను కనుగొనడం అంత సులభం కాదని అన్నారు. అయినప్పటికీ... సమాజంలో పెద్ద సంఖ్యలో ఈ కేటగిరీ దాతలు ఉన్నారని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... వివేక్ రామస్వామితో భారతీయ అమెరికన్ మద్దతుదారులు రిపబ్లికన్ పార్టీకీ విధేయులుగా ఉన్నారు. ఎప్పటినుంచో రిపబ్లికన్ విశ్వాసిగా ఉంటూ.. ఈ ఏడాది రిపబ్లికన్ నేషనల్ కన్వెషన్ లో ఏకైన భారతీయ అమెరికన్ ప్రతినిధిగా ఉన్న సంపత్ శివంగి.. ట్రంప్ ప్రచారానికి పెద్ద ఎత్తున నిధులు పంపుతున్నారని.. హోటల్ వ్యాపారి డానీ గైక్వాడ్ కూడా ఈ జాబితాలో ఉన్నారని అంటున్నారు.

ఇలా రెండు పార్టీలకూ బలమైన భారతీయ అమెరికన్లు ఏఏపీఐ డేటా 2024 ప్రకారం 55 శాతం మంది భారతీయ అమెరికన్లు డెమోక్రాట్లకు.. 25 శాతం మంది రిపబ్లికన్లకు మద్దతు ఇస్తుండగా.. 15 శాతం మంది న్యూట్రల్ గా ఉన్నట్లు గుర్తించారని అంటున్నారు.

కాగా... వైట్ హౌస్ కి వెళ్లే రహదారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందనేది నానుడి. ఇది టెక్నాలజీ రంగంలో సంపన్న భారతీయుల కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యలో... కమలా హారిసి ఇటీవల కాలిఫోర్నియా నిధుల సమీకరణలు ఒక వారంలో సుమారు $55 మిలియన్లు సంపాదించాయని చెబుతున్నారు. ఆమె నామినీ అయినప్పటి నుంచీ బిలియన్ డాలర్లు సేకరించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News