జగనా బాబా అన్నది మధ్యాహ్నానికే డిసైడ్ !

జూన్ 4 తెల్లవారుతూనే కోట్లాది మంది తెలుగు వారి గుండెలు టెన్షన్ తో కూడా ఆసక్తితో రోజు మొదలుపెడతారు.

Update: 2024-05-31 01:30 GMT

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలని కూడా రంగంలోకి దింపారు. జూన్ 4 తెల్లవారుతూనే కోట్లాది మంది తెలుగు వారి గుండెలు టెన్షన్ తో కూడా ఆసక్తితో రోజు మొదలుపెడతారు.

ఉదయం ఎనిమిది గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుని సమాంతరంగానే లెక్కిస్తారు అని అంటున్నారు. దాని వల్ల పోలింగ్ సరళి అన్నది తొలి అరగంటలోనే వెల్లడి కానుంది అని అంటున్నారు.

ఇక పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఊపు ఉంది అన్నది తెలిసినా ఈసారి హోరా హోరీ ఫైట్ కాబట్టి మధ్యలో ఫలితాలు కొన్ని రౌండ్లలో అటూ ఇటూ చక్కర్లు కొడుతూ గెలుపు గుర్రాలని వెనక్కీ ముందుకూ లాగుతూ ఉంటాయి. ఆ టెన్షన్ ఈసారి ఎన్నడూ లేని విధంగా ఉంటుంది అని అంటున్నారు.

ఇక తొలి ఫలితం అయితే ఉదయం పదకొండు గంటలకే వస్తుంది అని అంటున్నారు. అంటే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన మూడు గంటల వ్యవధిలో అన్న మాట. ఇక ఏకంగా 111 అసెంబ్లీ సీట్ల ఫలితాలు పూర్తిగా పక్కాగా మధ్యాహ్నం రెండు గంటల సమయానికల్లా వస్తుంది అని అంటున్నారు. ఈ 111 సీట్లలో కేవలం ఇరవై రౌండ్లలోనే ఫలితం నిర్ధారణ అవుతుందిట.

ఏపీలో అధికారం దక్కించుకోవాలీ అంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్. మరి 111 సీట్లలో ఫలితం వెల్లడి అయితే ఎవరి మ్యాజిక్ ఫిగర్ కి అతి చేరువగా ఉన్నారు అన్నది తెలిసిపోతుంది అన్న మాట. అలా రెండు గంటలకే ఏపీలో ఏర్పడే ప్రభుత్వం ఎవరిది అన్నది స్పష్టంగా తెలుస్తుంది అని అంటున్నారు.

మరొక వైపు చూస్తే 61 అసెంబ్లీ సీట్లలో ఫలితం రావడానికి 21 నుంచి పాతిక రౌండ్లు లెక్కించాల్సి ఉంటుందని అంటున్నారు. దాంతో ఈ ఫలితాలు వచ్చేందుకు సాయంత్రం నాలుగు గంటల సమయం పట్టవచ్చు అంటున్నారు. అంటే మొత్తం 172 ఫలితాలను సాయంత్రం నాలుగుకే వెల్లడించేందుకు ఈసీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

ఇక మూడే మూఒడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు మాత్రం లేట్ కావచ్చు అని అంటున్నారు. అవేంటి అంటే ఇవి పెద్ద నియోజకవర్గాలు ఎక్కువ మంది ఓటర్లు ఉండడంతో పాతికకు పైగా రౌండ్లు పట్టే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఇవి వెల్లడి అయ్యేందుకు సాయంత్రం ఆరు గంటల సమయం పడుతుంది అని అంటున్నారు.

మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్ల ఫలితాలు వెల్లడించి గెలిచిన వారికి డిక్లరేషన్ పత్రాలు అందించేటప్పటికి రాత్రి తొమ్మిది గంటల సమయం పట్టవచ్చు అని అంటున్నారు. ఇదంతా ఈసీ చాలా స్పీడ్ గా చేయడం వల్లనే సాధ్యపడుతుంది అని అంటున్నారు.

సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కిస్తారు. అయితే లక్షల్లో పోస్టల్ బ్యాలెట్ ఉండడంతో ఈసీ కొత్త విధానం ఎంచుకుంది ఈవీఎంలను తెరచి లెక్కబెడుతూనే వేరే చోట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తుంది అన్న మాట. ఇలా టైం సేవ్ చేయడంతో పాటు భారీ ఉత్కంఠ తో ఉన్న రాజకీయ పార్టీలకు జనాలకు కూడా తొందరగా ఫలితాలు అందించడం ద్వారా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ని పూర్తి చేయలనుకోవడమే ఈసీ విధానంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News