రాజకీయాల్లో దళపతి ఎంట్రీకి బ్రేక్ వేస్తుంది ఎవరు?
ఈ మధ్య కాలంలో వచ్చిన "లియో" సినిమా ఇందుకు తాజా ఉదాహరణ! ఈ సినిమా సుమారుగా రూ.630 కోట్లు రాబట్టిందని చెబుతున్నారు.
సౌత్ ఇండియాలో రీజనల్ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయి కలెక్షన్స్ సృష్టించగల స్టార్ హీరో ఎవరు అనగానే టక్కున చెప్పే పేరు దళపతి విజయ్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన "లియో" సినిమా ఇందుకు తాజా ఉదాహరణ! ఈ సినిమా సుమారుగా రూ.630 కోట్లు రాబట్టిందని చెబుతున్నారు. సినిమాల సంగతి అలా ఉంటే... సోషల్ సర్వీస్ లో యాక్టివ్ గా ఉండే విజయ్ పాలిటిక్స్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్న సంగతి తెలిసిందే!
కోలీవుడ్ లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్... ఆపదలో ఉన్న తన అభిమానులతో పాటు సామాన్య ప్రజానికానికి కూడా ఎలాంటి సాయం చేసేందుకు అయినా వెనుకాడడని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల తమిళనాట తుఫాన్ బీభత్సం సృష్టించినప్పుడు రోడ్డున పడిన పలు కుటుంబాలను ఆయన ఆదుకున్న విషయాన్ని గుర్తుచేస్తుంటారు. ఇదే సమయంలో పిల్లల చదువులను విజయ్ ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు.
కచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవాలని.. చదువు వల్లే సమాజంలో మార్పు వస్తుందని.. చదువుకోవడం వల్లే సమాజంలో తారతమ్యాలు తగ్గుతాయని చెబుతుంటారు. ఇదే సమయంలో ఓటును అమ్ముకోవద్దని క్యాంపెయిన్ కూడా చేస్తుంటారు. నోటు కోసం ఓటు అమ్ముకోవడం పాపంగా ఆయన అభివర్ణిస్తుంటారు.
ఆ సంగతి అలా ఉంటే... వచ్చే ఎన్నికల నాటికి విజయ్ పార్టీ స్థాపిస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొంతకాలంగా కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. పైగా ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పటినుంచో చేస్తున్న సోషల్ సర్వీస్ కార్యక్రమాలు మరింత జోరందుకున్నాయి కూడా! దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ ఫాం అండ్ సూన్ అనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. అయితే ఈ విషయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఒకరు బ్రేక్ వేస్తున్నారని కథనాలొస్తున్నాయి.
అవును... పొలిటికల్ ఎంట్రీ దాదాపు కన్ ఫాం అయిపోయిందని టాక్ నడుస్తున్న వేళ.. విజయ్ ఎంట్రీకి ఆయన సతీమణి సంగీత అడ్డుపడుతున్నారని ఒక చర్చ స్థానికంగా మొదలైంది. కేవలం ఆమె అభ్యంతరాల మేరకే ఆయన రాజకీయ ప్రకటన ఆలస్యం అవుతుందని తమిళనాట టాక్ నడుస్తుంది. దీంతో అసలు ఆమె ఎందుకు విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ వేస్తున్నారు.. అసలు కారణం ఏమిటి అనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైపోయింది.
ఇదే సమయంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఆయన సతీమణితో పాటు కుమారుడు జాసన్ కూడా అడ్డుతగులు తున్నాడని, తన పొలిటికల్ ఎంట్రీని కుమారుడు వ్యతిరేకిస్తున్నాడని కూడా చర్చ నడుస్తుంది. ఈ సమయంలో వీరితో విజయ్ ఏకీభవించకపోవడం వల్లే... భార్యభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయని అంటున్నారు. అయినప్పటికీ... విజయ్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టి ఉన్నారని అంటున్నారు.
కాగా... దళపతి విజయ్ భార్య ఒక డాక్టర్. అయితే వివాహం అనంతరం ఆమె గృహిణిగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తన కుమార్తెతో కలిసి ఆమె లండన్ లో ఉంటున్నారు. పైగా.. గత రెండేళ్లుగా విజయ్, సంగీత కలిసి ఏ ఈవెంట్ లో కనిపించలేదు. అదేవిధంగా... గతంలో తన సినిమా పూర్తి అయిన వెంటనే లండన్ వెళ్లే విజయ్... ఈ మధ్య కాలంలో వెల్లడం లేదు! దీంతో... విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇష్యూనే ఇందుకు కారణం అని.. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి!
అయితే... ఈ విడాకుల విషయాలను విజయ్ - సంగీతల సన్నిహితులు పలుమార్లు తెలిపారని అంటున్నారు. ఇదే సమయంలో ఇవన్నీ పుకార్లు అని.. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా... ఈ విషయాలపై దళపతి క్లారిటీ ఇచ్చేవరకూ క్లారిటీ వచ్చే అవకాశం లేదు!!