బాలినేని అదే చేస్తే.. జగన్ తప్పు చేసినట్టే..!
ఎన్నికల సమయంలోనూ.. అసలు ఆయనకు టికెట్ దక్కుతుందా? లేదా? అనే చర్చ కూడా వచ్చింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి త్వరలోనే జనసేనలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వ్యక్తిగతంగా ఆయనకు వైసీపీలో ఎదురవుతున్న సమస్యలు.. అవమానాలు.. పార్టీ అధిష్టానం కూడా తనకు ఎక్కువగా విలువ ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపథ్యం లో బాలినేని గత రెండేళ్లుగా వైసీపీపై వైముఖ్యంతోనే ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ.. అసలు ఆయనకు టికెట్ దక్కుతుందా? లేదా? అనే చర్చ కూడా వచ్చింది.
నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. బాలినేనికి మంత్రి పదవి దక్కేది కాదన్న చర్చ కూడా ఉంది. ఎలా చూసుకున్నా.. రాజకీయంగా బాలినేని వైసీపీకి దూరమయ్యేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చూపు జనసేనపై ఉంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో బాలినేనికి ఉన్న అనుబంధం రీత్యా.. అటు వైపు నుంచి నరుక్కువస్తున్నట్టు వైసీపీలోనే చర్చ ఉంది. ప్రస్తుతం ఆ పనులపైనే బాలినేని బిజీగా ఉన్నారని సమాచారం. రెండు రోజుల కిందట కూడా బాలినేనిని జగన్ దగ్గర పరాభవం జరిగినట్టు తెలిసింది.
జిల్లాలో బాధ్యతలు తీసుకోవాలని జగన్ కోరినా.. ఆయన అంగీకరించలేదు. దీనికి కారణం.. గతంలో తనను ఇరకాటంలో పెట్టిన కీలక నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు. దీనికి జగన్ ఓకే చెప్పడం లేదు. దీనికి తోడు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. తాను న్యాయ పోరాటం చేస్తన్నా.. పార్టీ నుంచి కొద్దిగా కూడా సహకారం లేదని బాలినేని వాపోతున్నారు. ఈ కారణాలతోనే తాను జిల్లా పదవిని చేపట్టనని చెప్పిన బాలినేని.. ఆ వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
ప్రస్తు తం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ద్వారా.. మరోవైపు నాగబాబు ద్వారా.. జనసేనలోకి చేరిపోయేం దుకు ఆయన పక్కా ప్లాన్ చేసుకున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం రానుందని తెలిసింది. ఇదిలావుంటే.. బాలినే ని వెళ్లిపోతే.. ఆయనకు ఇబ్బంది లేదు. ఆయన కేడర్ పదిలంగానే ఉంటుంది. కాకపోతే.. జిల్లాలో నష్టపోయేది మాత్రం వైసీపీనే. ప్రస్తుతం ఎవరిపైనైతే.. జగన్ ఆశలు పెట్టుకున్నారో.. వారికి కేడర్ సహక రించడం లేదు. ఉన్న కేడర్ అంతా.. బాలినేని లేదా ఇతర నేతల కనుసన్నల్లోనే ఉన్నదే. పైగా బాలినేనికి బలమైన కేడర్ ఉన్న మాట వాస్తవం. కాబట్టి ఏదైనా నష్టం జరిగితే.. అది వైసీపీకే తప్ప.. బాలినేని కాదని అంటున్నారు పరిశీలకులు.