లడ్డూ ఇష్యూ : ఎటూ తేల్చుకోలేకపోతున్న కేంద్రం ?

దానికి నాలుగు రోజులు సమయం తీసుకున్న ప్రభుత్వం మరో రోజు కూడా గడువు కోరడంతో కొత్త చర్చ సాగుతోంది.

Update: 2024-10-04 01:30 GMT

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ అతి పెద్ద జాతీయ సమస్యగా మారిపోయింది. అంతే కాదు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం ఇది. దాంతో ఈ ఇష్యూ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉండగా కేంద్రం అభిప్రాయాన్ని కోర్టు కోరింది. దానికి నాలుగు రోజులు సమయం తీసుకున్న ప్రభుత్వం మరో రోజు కూడా గడువు కోరడంతో కొత్త చర్చ సాగుతోంది.

లడ్డూ ఇష్యూ విషయంలో కేంద్రం ఏమీ తేల్చుకోలేకపోతోందా అన్నదే ఇక్కడ అంతా ఆలోచిస్తున్న విషయం. లడ్డూ ఇష్యూ చాలా సెంటిమెంట్ తో కూడిన అంశం. దీని మీద నిజాలు నిగ్గు తేల్చాలని భక్త కోటి కోరుతోంది. ఇక సుప్రీం కోర్టు రిమార్క్స్ కూడా కేంద్రం తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటుంది అని అంటున్నారు.

ముందుగా సీఎం లడ్డూలలో కల్తీ జరిగింది అని చెప్పి సిట్ ని తరువాత ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సిట్ ద్వారా వాస్తవాలు బయటకు రావు అన్నది వైసీపీ ఆరోపణ మాత్రమే కాదు ఏపీ లోపలా బయటా భక్తుల ఆలోచనలూ అందులో అలాగే ఉంటాయని అంటున్నారు.

ఇక ఈ విషయంలో ఎంతో కలత చెందుతున్న హిందువులకు స్వాంతన కలగాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని మెజారిటీ కోరుకుంటున్నారు. ఇక సుప్రీం కోర్టు కూడా సిట్ కొనసాగించాలా లేక మరేదైనా విచారణ అంటూ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమంది.

దీనిని బట్టి అన్ని కోణాలలో కేంద్రం అలోచించాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఒక వైపు రాజకీయంగా కూడా ఆలోచించాలి.ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. అందులో బీజేపీ ఉంది. ఎన్డీయేలో బాబు కీలక భాగస్వామిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత సన్నిహిత మిత్రుడు. సో కూటమి ప్రభుత్వం వేసిన సిట్ ని కాదు అంటే అది రాజకీయంగా ఇబ్బంది.

అదే టైం లో ఇండిపెండెంట్ గా వేరే సంస్థ చేత విచారణ అంటే అది వైసీపీకే పొలిటికల్ గా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఈ విషయంలో కోర్టు ఏపీ ప్రభుత్వం మీద సీఎం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సంచలన నిర్ణయం దిశగా వెళ్లాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఇక సిట్ ని కాదంటే కనుక కచ్చితంగా కూటమిలోని చంద్రబాబుకు పవన్ కి కూడా కోపం వస్తుంది. కేంద్రంలో బీజేపీ ఈ రెండు పార్టీల మద్దతుతోనే సాగుతోంది. అయితే హిందూత్వ ఫిలాసఫీని తన శ్వాసగా మార్చుకున్న బీజేపీకి ఏపీ బయట ఉన్న హిందూ సంస్థలు ఉత్తరాదిలో బలంగా ఉన్న హిందూ సంస్థల నుంచి తటస్థంగా దర్యాప్తు చేస్తేనే బెటర్ అన్న సూచనలు ఒత్తిళ్ళు వస్తున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి బీజేపీకి మా చెడ్డ ఇరకాటం వచ్చిపడింది అని అంటున్నారు. తన సొంత ఫిలాసఫీ అలాగే హిందువుల మనో భావాలు అదే సమయంలో రాజకీయ అవసరాలు ఇవన్నీ కలసి బీజేపీ ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోందా అని అంటున్నారు. నిజంగా ఊగిసలాటలోనే కేంద్రం ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీకి రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.వారి మద్దతు కూడా బీజేపీకి పొలిటికల్ గా అవసరమే అని అంటున్నారు. మొత్తానికి లడ్డూ కాదు కానీ బీజేపీ సంకట పరిస్థితి కి వెళ్ళింది అని అంటున్నారు. ఇక శుక్రవారం ఈ కేసు విచారణకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి అన్నది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమి చెబుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠగానే ఉంది.

Tags:    

Similar News