టీడీపీ కూటమి వయా జనసేన!

దాంతో టీడీపీలో ఎవరు చేరినా వర్గ పోరు తప్పించి లాభం ఉండదని కూడా భావిస్తున్నారు.

Update: 2024-10-24 19:30 GMT

ఏపీలో వైసీపీకి అసలైన ప్రత్యర్ధి ఎవరు అంటే టీడీపీ కానే కాదు ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయింది. కానీ వైసీపీ నేతలను పెద్ద ఎత్తున అయితే చేర్చుకోవడం లేదు. నిజానికి చూస్తే వైసీపీని బలహీనం చేయాలన్న కసి పట్టుదల టీడీపీకి ఉన్నా గతంలో చేసిన తప్పులు చేయకూడదు అన్న ఆలోచనతోనే ఆగిపోతున్నారు.

పైగా ఇప్పటికే టీడీపీ హౌస్ ఫుల్ అయిపోయింది. దాంతో టీడీపీలో ఎవరు చేరినా వర్గ పోరు తప్పించి లాభం ఉండదని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గంలో టీడీపీకి ఎమ్మెల్యే స్థాయి నేతలు నలుగురైదుగురు ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రేపటి రోజున సర్దిచెప్పుకోవచ్చు. కానీ బయట నుంచి వచ్చిన పార్టీలకు ప్రయారిటీ ఇస్తారని వారు భావిస్తే మాత్రం బలమైన చోటనే పార్టీ వీక్ అవుతుంది

అందుకే టీడీపీ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. మరో వైపు చూస్తే టీడీపీ రాజ్యసభ కోసం లేక శాసనమండలి కోసం మాత్రమే నేతలను చేర్చుకోవాలని అనుకుంటోంది. ఆ రెండు చోట్లా తాను బలంగా మారడానికే ఈ రకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

అందుకే ఇప్పటికి ముగ్గురు ఎంపీలు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆ సీట్లు టీడీపీ ఖాతాలో పడనున్నాయి. అంతే తప్ప మామూలు నేతలను ఆ పార్టీ చేర్చుకోవడం లేదని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఒక సీనియర్ నేత మంత్రిగా పలు మార్లు పనిచేసిన వారు అయిన పెద్ద మనిషి టీడీపీ తలుపు తట్టినా కూడా అసలు స్పందన లేదని అంటున్నారు. దాంతో ఆయన జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇలా చాలా మంది నేతలు ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీ నుంచి బయటపడాలని చూసినపుడు తొలి ప్రాధాన్యత టీడీపీకే అని అంటున్నారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవడం ఆ పార్టీ కిటకిటలాడడంతో జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా అధికారంలో ఉన్న కూటమిలో ఉంటేనే తమకు రానున్న అయిదేళ్ళూ శ్రీరామరక్ష అని వైసీపీలోని చాలా మంది నేతలు భావిస్తున్నారు. చాలా మందికి సొంత పనులు వ్యవహారాలు ఉన్నాయి. కేసులతో టార్గెట్ చేస్తే తామెక్కడ తట్టుకోగలమని భావిస్తున్న వారు అంతా కూటమి పల్లకీ ఎక్కేందుకు చూస్తున్నారు.

అయితే వీరు జనసేనలోకి రావాలని చూసినా కూడా అధినేత పవన్ కళ్యాణ్ ఏమీ తొందరపడడం లేదు అని అంటున్నారు. ఆయన నేతల ట్రాక్ రికార్డు చూస్తున్నారని అలాగే ఆయా నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులను కూడా చూస్తున్నారు అని అంటున్నారు

అంతే కాదు అక్కడ టీడీపీ జనసేన ఈక్వేషన్లు కూడా చూస్తున్నారు అని చెబుతున్నారు. జనసేనలోకి నేతలు వచ్చి ఆ విధంగా కూటమిలో స్థానం సంపాదించి పెత్తనం చేస్తామంటే టీడీపీ తమ్ముళ్ళు అయితే ఊరుకోరని అంటున్నారు. దాంతో అన్ని విషయాలను కూడా చూసుకుంటూనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేనలో చేరే వైసీపీ నేతల లిస్ట్ ఒకటి తయారు అవుతోనని మంచి ముహూర్తం చూసుకుని వారి మెడలో జనసేన కండువా కప్పేయడమే అని అంటున్నారు. ఇక ఇలా చేరుతున్న వారు ఎవరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని అధినాయకత్వం ఏ హామీ ఇవ్వడం లేదని అంటున్నారు. ఎవరికి వారు స్వచ్చందంగానే చేరాల్సిందే అంటున్నారు.

వారికి పార్టీ గౌరవిస్తుందని తగిన మర్యాదలు ఉంటాయని మాత్రమే చెబుతున్నారని టాక్. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉండడం కంటే బెటర్ అని భావించిన వారు అంతా కూటమిలోకి వయా జనసేనగా పోలోమని వస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ పరిణామాలు కూటమిలో ఏ రకమిన రాజకీయానికి దారి తీస్తాయో చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News