నాగబాబు కేంద్ర మంత్రి అవడం ఖాయం ?

ఆర్ క్రిష్ణయ్య తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని అలా వదిలేసుకున్నారు.

Update: 2024-09-29 16:13 GMT

మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతోంది. ఆయన రాజకీయ జీవితం సరికొత్త మలుపు తిరగనుంది అని అంటున్నారు. అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయకుండా త్యాగం చేసిన నాగబాబుకు ఇపుడు అదృష్టం మెయిన్ డోర్ కొట్టి మరీ లోపలికి వస్తోంది అని అంటున్నారు.

లేకపోతే వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య అనూహ్యంగా రాజీనామా చేయడం, ఆ విధంగా మూడవ ఎంపీ సీటు ఖాళీ కావడం అంతా ఒక లక్ అనే అంటున్నారు. ఆర్ క్రిష్ణయ్య తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని అలా వదిలేసుకున్నారు.

దీంతో పెద్దల సభలో నాలుగేళ్ల పదవీ కాలం అంటే అది బంగారు పళ్లెంలోతో పాటు దక్కే చాన్స్ అని అంటున్నారు. అంతకు ముందు ఇద్దరు రాజ్యసభ వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రెండు ఎంపీ సీట్లలో టీడీపీ వారినే ఏంపిక చేయాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా ప్రచారం సాగింది.

అయితే ఇపుడు కొత్తగా మూడవ ఎంపీ సీటు ఖాళీ అయింది. దాంతో ఈ సీటు జనసేనకు ఇస్తారని కూడా అంతా అంటున్నారు. నాగబాబుకే ఆ సీటు కన్ ఫర్మ్ అని కూడా చెబుతున్నారు. నాగబాబుని రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయమని మిగిలిన రెండు ఎంపీ సీట్లలో తమ పార్టీ వారిని చంద్రబాబు పెద్దల సభకు పంపిస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేంద్ర మంత్రి వర్గం ఏర్పాటు సందర్భంగా టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అప్పట్లోనే జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ జనసేన ప్రాతినిధ్యం లేకుండానే కేంద్ర కేబినెట్ ఏర్పాటు అయింది.

దాంతో జనసేనకు ఎప్పటికైనా ఆ మంత్రి పదవి రిజర్వు అయి ఉంటుందని అంటున్నారు. దాంతో నాగబాబు పెద్దల సభకు ఎన్నిక అయితే ఆయనకు కచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని లెక్క వేస్తున్నారు. అయితే కొంత కాలం పాటు ఆయన ఆగాల్సి ఉంటుందని అంటున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ సమయంలో నాగబాబుకు ఈ గోల్డెన్ చాన్స్ దక్కుతుందని చెబుతున్నారు.

అదే కనుక జరిగితే మెగా కుటుంబంలో ఒక అరుదైన రికార్డు పొలిటికల్ గా సాధించినట్లు అవుతుంది అని అంటున్నారు. మెగా స్టార్ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రి గా పంచేశారు. ఇపుడు అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు.

ఇక నాగబాబు కూడా కేంద్ర మంత్రి అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములూ మంత్రులు అయిన రికార్డు వారికే సొంతం అని అంటున్నారు. సినీ రంగంలో ఎన్నో రికార్డులను సృష్టించి వేరు ఎవరికీ అవి అందని విధంగా జెండా ఎగరేసిన మెగా ఫ్యామిలీ ఇపుడు పొలిటికల్ గా సక్సెస్ రూట్లో సాగుతోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఉందని అంటున్నారు. మూడు ఎంపీ సీట్లలో తనకూ వాటా ఒకటి ఇవ్వాలని కేంద్ర బీజేపీ నాయకత్వం కోరుతుందని అంటున్నారు. మరి బీజేపీకి ఏ విధంగా నచ్చ చెబుతారో చూడాల్సి ఉంది. బీజేపీకి తరువాత విడతలో ఇస్తామని చెప్పి ఈ మూడు ఎంపీ సీట్లలో టీడీపీ జనసేన తమ వారిని పంపుకోవచ్చు అని అంటున్నారు. సో రాజ్యసభ ఎంపీల ఎన్నికకు నోటిఫికేషన్ రావాలి కానీ నాగబాబు మొదట ఎంపీ అవుతారని తరువాత కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు. చూడాల్సిందే.

Tags:    

Similar News