జమిలి ఎన్నిక లొస్తే సీఎం రేసులో ఈ ముగ్గురేనా ?

దానికి మిత్రుల నుంచి కూడా సానుకూల స్పందన లభించింది.

Update: 2024-10-21 04:28 GMT

దేశంలో జమిలి ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ శీతాకాల సమావేశాలలో జమిలి ఎన్నికల మీద పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదించుకోవాలన్న పట్టుదలతో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ఉంది. ఈ మేరకు ఈ విషయాన్ని హర్యానాలో తాజాగా జరిగిన ఎన్డీయే సమావేశంలో మిత్ర పక్షాలకు బీజేపీ స్పష్టం చేసింది. దానికి మిత్రుల నుంచి కూడా సానుకూల స్పందన లభించింది.

నిజానికి జమిలి ఎన్నికల వల్ల మిత్రులలో ఎక్కువగా నష్టం వాటిల్లేది ఏపీ సీఎం చంద్రబాబుకే. ఎందుకంటే ఆయన అధికారం ఏకంగా రెండున్నరేళ్ళ పాటు కోత పడుతుంది. ఇక బీహార్ లో ఎన్నికలు వాయిదా వేయడం చేస్తారు అంటున్నారు. అది సీఎం నితీష్ కుమార్ కి లాభమే అని అంటున్నారు

ఒకవేళ ఎన్నికలు జరిపించినా ఎన్డీయే కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తాయని అంచనాలు ఉన్నాయి. సో ఇబ్బంది అయితే చంద్రబాబుకే ఉంది అని అంటున్నారు. అయితే చంద్రబాబు జమిలి ఎన్నికలకు అంగీకరించడానికి కారణం తన కుమారుడు లోకేష్ ని రాజకీయంగా మరింత ముందుకు తీసుకుని రావచ్చు అన్న ఆలోచనతోనే అని అంటున్నారు.

సో ఆ విధంగా చూసుకుంటే కనుక 2026లో చివరిలో కానీ 2027 మొదట్లో కానీ జమిలి ఎన్నికలు జరిగిన పక్షంలో ఏపీలో కూటమి గెలిస్తే లోకేష్ కి సీఎం కుర్చీ దక్కే చాన్స్ ఉంటుందని అంటున్నారు. దానికి రాజకీయ లెక్కలు ఎలా ఉంటాయంటే ఈసారి కూటమిలో సీట్ల షేర్ దగ్గరే సీఎం పోస్టు మీద కూడా ఒప్పందాలు చేసుకుంటారు అని అంటున్నారు. అంటే మూడేళ్ళు రెండేళ్ళు లెక్కన ఈ షేర్ ఉండొచ్చు. లేదా చెరి రెండున్నరేళ్ళు ఉండొచ్చని అంటున్నారు.

అంటే బీజేపీ జనసేనకు సగం, టీడీపీకి సగం అన్న పక్షంలో టీడీపీ నుంచి లోకేష్ సీం క్యాండిడేట్ గా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వచ్చేస్తారు అని అంటున్నారు. ఇక చంద్రబాబుని సీనియారిటీ రిత్యా కేంద్రానికి తీసుకుని వెళ్ళి కేబినెట్ లో కీలక స్థానం ఇవ్వవచ్చు అన్న ప్రచారం కూడా ఉంది.

అంటే జమిలి ఎన్నికలు వస్తే కనుక టీడీపీ కూటమి నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ సీఎం అభ్యర్ధులుగా ఉండే చాన్స్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఆ విధమైన ఒప్పందం ఉంటేనే తప్ప క్షేత్ర స్థాయిలో అన్ని పార్టీలు కలసి కసిగా పనిచేయవు అని కూడా అంటున్నారు.

ఇక వైసీపీ నుంచి చూస్తే జగన్ కచ్చితంగా సీఎం అభ్యర్థిగా ఉంటారు. ఆయనకు వైసీపీలో పోటీ ఎవరూ లేరు. పైగా 2024 ఎన్నికల్లో తమదే అధికారమని ఆయన ఈ ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు. ఈవీఎంలతో మేనేజ్ చేశారు అన్న బాధ కూడా వైసీపీ అధినాయకత్వం లో ఉంది. మరో సారి ఎన్నికలు అది కూడా తక్కువ టైం లో వస్తే తమకే లాభమని వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని లెక్కలేవో జగన్ వద్ద ఉన్నాయి.

అంటే జమిలి ఎన్నికలు వస్తే ప్రధానంగా సీఎం సీటు కోసం పోటీ పడేది జగన్, పాన్ లోకేష్ అని అంటున్నారు. ఎందుకంటే 2027 ప్రథమార్ధంలో ఎన్నికలు అంటూ జరిగితే మళ్ళీ 2032 దాకా ఎన్నికలు ఉండవు. అందువల్ల ఎవరూ అప్పటిదాకా తమ సీఎం కోరికలను దాచుకుంటూ ఉండలేరు. అది కూటమిలో అయినా వైసీపీ నుంచి అయినా పట్టుదలగానే రేసులో ఉంటారు, పోరాడుతారు అని అంటున్నారు. ఆ మీదట జనాలు ఎవరిని గెలిపిస్తారు అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు

Tags:    

Similar News