ప్రతిపక్షం కాదు.. ప్రతిపక్ష నేత హోదా రాదు.. వైసీపీ పక్ష నేతగా అనూహ్య ఎంపిక

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వస్తారా? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే.

Update: 2024-06-18 17:30 GMT

ఏపీలో ఎన్నికలు, సీఎం ప్రమాణం, మంత్రుల ప్రమాణం అన్నీ పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్పీకర్ ఎన్నిక. ఇది ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యవహారం. మరోవైపు ప్రతిపక్షం కోణంలో చూస్తే వైసీపీ తరఫున శాసన సభా పక్ష నేత ఎవరనేది? వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ 11 సీట్లకే పరిమితం అయింది. మొత్తం 175 సీట్లకు గాను పదిశాతం స్థానాలు వస్తేనే (అంటే 18) ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈ మార్క్ కు వైసీపీ 7 స్థానాలు వెనుకబడి ఉంది.

జగన్ అసెంబ్లీకి వస్తారా?

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వస్తారా? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే. అందులోనూ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఆయన సభలో ఉంటారని భావించలేం. మరోవైపు జగన్ వైసీపీ శాసన సభా పక్ష బాధత్యలు కూడా చేపట్టరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తారని అంటున్నారు. పెద్దిరెడ్డి ఇటీవలి ఎన్నికల్లో తీవ్ర ఎదురుగాలిలోనూ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను శాసనసభాపక్ష నేతగా ఉండడం కంటే.. అత్యంత సీనియర్ అయిన పెద్దిరెడ్డికి ఆ బాధ్యత అప్పగించడం సరైనదని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Read more!

ప్రతిపక్ష నేత హోదా లేనందుకేనా?

శాసనసభలో ప్రతిపక్షం, ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో వైసీపీ సభ్యులకు వెనుక వరుసలో ఎక్కడో సీట్లు రానున్నాయి. ఇది వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి. అందులోనూ మొన్నటివరకు 151 ప్లస్ సీట్లతో అత్యంత వైభవం చూసిన పార్టీకి మరింత హ్యులియేషన్ లా ఉంటుంది. వీటన్నిటినీ ఆలోచించే జగన్ నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

మరోవైపు జగన్ వ్యవహార శైలి తెలిసినవారు ఆయన ఎలాంటి పరిస్థితినైనా హుందాగా ఎదుర్కొంటారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో 10 మంది మిగతా సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తారని, వైసీపీ శాసన సభా పక్ష నేత ఆయనే ఉంటారని చెబుతున్నారు.

Tags:    

Similar News