పవన్ తో ముద్రగడ ఢీ కొడతారా...!?
పవన్ కళ్యాణ్ కి ఘాటుగా తాజాగా లేఖ రాసి ముద్రగడ జనసేన వైపు చూడనని చెప్పేశారు.
జనసేన అధినేత అన్నీ ఆలోచించుకుని మరీ పిఠాపురం సీటు నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. పిఠాపురంలో మొత్తం జనాభాలో అత్యధిక శాతం కాపులు ఉన్నారు. దాంతో ఈ సీటు నుంచి పోటీ చేస్తే గెలుపు ఈజీ కావడమే కాదు, మెజారిటీ కూడా భారీగా ఉంటుందని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు లోకల్ జనసేన నేతలకు పవన్ పూర్తి సమాచారం ఇచ్చారని అంటున్నారు. దాంతో పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్నది కన్ ఫర్మ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్ లో జనసేన నేతలు వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలో వచ్చే లిస్ట్ లో పవన్ పోటీ చేసే సీటు పిఠాపురం అని ఖరారు చేయడమే మిగిలింది.
ఈ వార్తతో అధికార వైసీపీ ఫుల్ అలెర్ట్ అయింది. వైసీపీ పవన్ ని ఓడించాలని చూస్తోంది అన్నది తెలిసిందే. 2019 ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి పాలు అయ్యారు. నాడు అలా స్కెచ్ గీసిన వైసీపీ ఇపుడు పిఠాపురం లో కొత్తరకం స్కెచ్ గీస్తోంది.
పిఠాపురంలో పవన్ కి ప్రత్యర్ధిగా బలమైన అభ్యర్ధిని దింపాలని చూస్తోంది అని అంటున్నారు. పిఠాపురం నుంచి కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని దించాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ఘాటుగా తాజాగా లేఖ రాసి ముద్రగడ జనసేన వైపు చూడనని చెప్పేశారు. దాంతో ముద్రగడ రాజకీయం విషయంలో ఒక క్లారిటీకి వచ్చిన వైసీపీ ఆయనతో సంప్రదింపులకు తెర తీసింది అని అంటున్నారు.
ఈసరికే ముద్రగడ చిన్న కుమారుడుతో వైసీపీ పెద్దలు చర్చలు జరిపారు అని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం వస్తే కనుక ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన నో అంటే ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆ విధంగా ముద్రగడను ముగ్గులోకి లాగి పవన్ మీద గట్టి పోటీ చేయించాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో పిఠాపురం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వంగా గీతను హుటాహుటీగా వైసీపీ హై కమాండ్ పిలిపించుకుని మరీ చర్చలు జరిపినట్లుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే ముద్రగడ కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఉంటేనే బెటర్ అని వైసీపీ పెద్దలు తమ ఆలోచనలు ఆమెతో చెప్పి పిఠాపురం మీదనే డిస్కషన్ చేశారని అంటున్నారు.
వంగా గీతకు పిఠాపురం నుంచి పక్కన పెట్టి వేరే అసెంబ్లీ సీటు ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద పవన్ ని మరోసారి ఓడించడం ద్వారా ఆయన రాజకీయ జీవితానికి ఈసారి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మరి ముద్రగడ రెడీ అవుతారా. వైసీపీ నుంచి పోటీ చేసి పవన్ ని ఢీ కొడతరారా అన్నది చూడాల్సి ఉంది.