కొత్త చర్చ... ఐపీఎల్ లో కోల్ కతా - ఏపీలో కూటమి?
మరోవైపు ఆయా పార్టీల ధీమాలతో పాటు పలు సెంటిమెంట్ లు, కనెన్షన్లూ తెరపైకి వస్తున్నాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచీ జూన్ 4న విడుదలవ్వబోయే ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో పలు రకాల విశ్లేషణలు, అభిప్రాయాలు, సెఫాలజిస్టుల అంచనాలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయా పార్టీల ధీమాలతో పాటు పలు సెంటిమెంట్ లు, కనెన్షన్లూ తెరపైకి వస్తున్నాయి.
అవును... మే 13న ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల కోసం మాత్రం జూన్ 4 వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి! దీంతో ఈ గ్యాప్ లో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణల సంగతి ఒకెత్తు అయితే... జూన్ 9న ప్రమాణా స్వీకారాలకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది వైసీపీ!
ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ ఫలితంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా... తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ 17లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో.. 2012, 2014 తర్వాత మూడోసారి ఆ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది!
అయితే... 2014లో ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో ఆ ఏడాది ఐపీఎల్ సీజన్ లోనూ కోల్ కతానే గెలిచింది! దీంతో సరిగ్గా 10ఏళ్ల తర్వాత 2024 ఐపీఎల్ లో మరోసారి కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
2024లో కూడా 2014 తరహాలోనే టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. దీంతో... ఐపీఎల్ లో కేకేఆర్ సెంటిమెంట్ తరహాలోనే ఈసారి కూడా ఏపీలో కూటమి విజయం సాధించబోతుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మరి జూన్ 4 వరకూ వేచి చూస్తే... ఈ కేకేఆర్ - కూటమి సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది!