కొంపముంచిన లిప్‌స్టిక్.. ఏకంగా ఉద్యోగానికే ఎసరు
మహిళలు తమ పెదవుల అందం కోసం లిప్‌స్టిక్ వేసుకుంటుంటారు.
మహిళలు తమ పెదవుల అందం కోసం లిప్‌స్టిక్ వేసుకుంటుంటారు. లిప్‌స్టిక్ తమ అందాన్ని మరింత పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ.. చెన్నైలో జరిగిన ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లిప్‌స్టిక్ ధరించినందుకు ఓ మహిళ చేస్తున్న ఉద్యోగం నుంచి బదిలీ కావాల్సి వచ్చింది. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ పరిధినలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది.
చెన్నై మున్సిపల్ కమిషనర్ మేయర్ ప్రియ వద్ద 50 ఏళ్ల దాపేతర్ మాధవి టేపీదార్‌గా పనిచేస్తున్నారు. టేపీదార్ అంటే మేయర్ వస్తుంటే.. వారికన్న ముందు వెళ్లి మేయర్ వస్తున్నారని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే.. మేయర్ ప్రియ వేసుకుంటున్న లిప్‌స్టిక్ కలర్లనే మాధవి వినియోగిస్తుండేది. దాంతో చాలా సందర్భాల్లోనూ మేయర్ ఆమెకి సూచించింది. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు.
దాంతో అధికారులు ఆకస్మా్త్తుగా ఆమెను ట్రాన్స్‌ఫర్ చేశారు. అందుకే ఈ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ప్రియతో సమానాంగా లిప్‌స్టిక్ వేసినందుకే తనను బదిలీ చేశారంటూ మాధవి ఆరోపించారు. ఇటీవల ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఈ సంచలన కామెంట్స్ చేశారు. లిప్‌స్టిక్ అంతలా వేయకూడదని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. తనకే కాదు.. తనతోపాటు మరో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులను హెచ్చరించినట్లు చెప్పారు. మీ లిప్ స్టిక్, మేడమ్ లిప్ స్టిక్ ఒకే ఉన్నాయని, ఆ స్టైల్ వేసుకోకూడదని పీఏ హెచ్చరించినట్లు చెప్పారు.
తాను చిన్నప్పటి నుంచే వేసుకుంటున్నానని, ఇప్పుడు దీనిని మార్చలేనని సమాధానం చెప్పినట్లు వివరించారు. తాను పనిలో బాగానే ఉన్నానని, ఇది మహిళలకు అన్యాయమని, మానవ హక్కుల ఉల్లంఘనేనని దాపేతర్ మాధవి ఆరోపించారు. తనకు నచ్చినట్లుగా లిప్ స్టిక్ వేసుకుంటానని చెప్పారు. అయితే.. మాధవీ ఆరోపణలపై చెన్నై కార్పొరేషన్ స్పష్టం చేసింది. దాపేదర్ మాధవి బదిలీపై వచ్చిన వార్తలన్నీ తప్పని, లిప్ స్టిక్ కారణంగా ఆమెను బదిలీ చేయలేదని చెప్పింది.