ఏపీ రవాణా మంత్రికి 'రాజకీయ' కుదుపులు!
ఒకటి ఎన్నికలకు ముందు.. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో మహిళలను విశేషంగా ఆకట్టుకున్న ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నియమితులైన.. రాయచోటి ఎమ్మెల్యే మండపల్లి రాంప్రసాద్‌రెడ్డికి భవిష్య త్తులో రాజకీయ కుదుపులు పెరగనున్నాయా? ముఖ్యంగా ప్రజా రవాణా విషయంలో కూటమి ప్రభుత్వ అధినేత, సీఎం చంద్రబాబు ఇచ్చిన వరం.. ఈయనకు ఇబ్బందిగా మారనుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రెండు కీలక అంశాల విషయంలో ఇచ్చిన హామీలు... మంత్రి మండపల్లికి పరీక్షేనని చెబుతున్నారు. అయితే, ఆయన వ్యూహాత్మకంగా వేసే అడుగులు కనుక సక్సెస్ అయితే.. పెద్ద క్రెడిట్టే లభిస్తుందని చెబుతున్నారు.
ఒకటి ఎన్నికలకు ముందు.. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో మహిళలను విశేషంగా ఆకట్టుకున్న ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం. దీనిని అమలు చేసేబాధ్యత రవాణా శాఖ మంత్రిగా ఉన్న మండపల్లిపైనే ఉంది. రాష్ట్రంలో సుమారు రోజుకు అరకోటి మంది మహిళలు.. పలు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్నారని ఇప్పటికే ఆయన ఒక లెక్క సేకరించి పెట్టుకున్నారు. వీరంతా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. రోజుకు గరిష్ఠంగా రెండు సార్లు వారు ప్రయాణించినా.. అది ఆర్టీసీపై బారం పడేలా చేస్తుంది. అలాగని హామీని అమలు చేయకా తప్పదు. ఆర్టీసీని ఉచితంగా అమలు చేస్తే.. మహిళలు మరింత ఎక్కువగా బస్సులనే ఆశ్రయిస్తారు.
దీంతో ప్రస్తుతం అరకోటిగా ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య కోటికి చేరినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు, ఆర్టీసీ ఉన్నతాధికా రులు సైతం అంచనా వేస్తున్నారు. మరింత పెరగనుంది. దీనిని ముందుగానే అంచనా వేసుకుని.. ఇబ్బందులు లేనివ్యవస్థను మంత్రి మండపల్లి తీసుకురావాల్సి ఉంది. ఇక, మరో కీలక విషయం.. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ ఆర్భాటంగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ క్రమంలోనే పీటీడీ(పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటు)గా పేరు మార్చారు. కానీ, విభజన హామీల్లో ఒకటైన ఆర్టీసీ ఆస్తులు తెలంగాణలోనే ఉండిపోయాయి. ఇప్పటికీకొన్ని రావాల్సి ఉంది. రవాణా మంత్రిగా వీటిని ఏపీకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మండపల్లిపైనే ఉంది.
అదేసమయంలో రవాణా శాఖలో కీలకమైన ఆర్టీఏ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉంది. అవినీతి రహితం చేయాలని ఎన్ని ప్రయ త్నాలు జరిగినా.. ఆర్టీయే ప్రక్షాళన కావడం లేదు. డిజిటల్ వ్యవస్థను తీసుకువచ్చి లైసెన్సులు, రవాణా రంగాన్ని ఆధునీకరిం చినా.. ఆర్టీఏలో అవినీతి ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. ఇక, రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. సో.. ఎలా చూసుకున్నా.. ఆర్టీసీ మంత్రిగా మండపల్లికి రాజకీయ కుదుపులు అయితే తప్పేలా లేవని అంటున్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడ్డ సొమ్మును ఆయన వసూలు చేసుకోవడం ఈ కుదుపుల్లో మరో కీలకమైన వ్యవహారం మరి ఏం చేస్తారో చూడాలి.