అత్యంత సేఫెస్ట్, డేంజరస్ కంట్రీస్ ఇవే... భారత్ స్థానం?
ఈ జాబితాలో మరోసారి, వరుసగా ఎనిమిదోసారి ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ సంపాదించుకొంది.;

ఇటీవల ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ (మార్చి 20) ని పురస్కరించుకొని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్... వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - 2025ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మరోసారి, వరుసగా ఎనిమిదోసారి ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ సంపాదించుకొంది. ఈ సమయంలో ప్రపంచంలోనే సేఫెస్ట్, డేంజరస్ దేశాల జాబితా తెరపైకి వచ్చింది.
అవును... ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు క్రౌడ్ సోర్స్డ్ డేటా ఫ్లాట్ ఫామ్ నంబియో సర్వే ఫలితాలు వెల్లడించింది. ఈ సందర్భంగా... నేరాల రేటు ఆధారంగా 2025కి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో 'అండోరా' దేశం ప్రయాణికులకు ఉత్తమ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది.
స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న ఈ చిన్నదేశమైన అందోరా.. 84.7 అద్భుతమైన భద్రతా స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ప్రకటించబడింది. ఈ దేశం విస్తీర్ణం కేవలం 181 చదరపు మైళ్లు కాగా.. జనాభా 82,638 మాత్రమే. ఇక... 84.5 స్కోరుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 84.2 స్కోర్ తో ఖతార్, 82.9 స్కోరుతో తైవాన్, 81.7 స్కోరుతో ఒమన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇక 55.7 స్కోరుతో ఈ సూచికలో భారతదేశం 66వ స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో... అగ్రరాజ్యం అమెరికా 50.8 స్కోరుతో 89వ స్థానంలో నిలవగా.. 51.7 స్కోరుతో యునైటెడ్ కింగ్ డమ్ 87వ స్థానంలో ఉంది. ఇక మరోవైపు.. 19.3 స్కోరుతో అత్యంత ప్రమాదకరమైన దేశంగా వెనిజులా నిలిచింది.
వెనిజులా తర్వాత 19.7 స్కోరుతో పాపువా న్యూ గినియా, 21.1 స్కోరుతో హైతీ, 24.9 స్కోరుతో ఆఫ్ఘనిస్తాన్, 25.3 స్కోరుతో దక్షిణాఫ్రియా దేశాలు.. అత్యంత ప్రమాదకరమైన జాబితాలో వరుసగా ఉన్నాయి.
ఈ జాబితాను రూపొందించడం కోసం నంబియా పలు విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఇందులో భాగంగా... పగలు, రాత్రి నివాసితులు ఎలా సురక్షితంగా ఉన్నారు.. దొంగతనాలు, బహిరంగ ప్రదేశాలలో వేధింపులతో పాటు జాతి, చర్మ రంగు, లింగ, మతం ఆధరంగా వివక్షత ఎలా ఉంది అనేవాటిని పరిగణనలోకి తీసుకుంది.