వైసీపీ ఐదో జాబితా మీద యమ టెన్షన్ !

ఇక ఐదవ జాబితాలో కీలకమైన జిల్లాలు నియోజకవర్గాలలో మార్పు చేర్పులు భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు.

Update: 2024-01-19 18:22 GMT

వైసీపీ ఇప్పటిదాకా నాలుగు జాబితాలు రిలీజ్ చేసింది. ఇక ఇపుడు ఐదో జాబితా రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు జాబితాలలో మొత్తం 58 మంది ఎమ్మెల్యేలు, అలాగే పది మంది ఎంపీ సీట్లలో కొత్త ఇంచార్జిలను నియమించింది. ఇక ఐదవ జాబితాలో కీలకమైన జిల్లాలు నియోజకవర్గాలలో మార్పు చేర్పులు భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు.

ఈ జాబితాలోనే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేల సీట్లు ఉంటాయని అంటున్నారు. దీంతో పలు జిల్లాల నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ కావడం విశేషంగా చెప్పుకోవాలి.

సీఎం ని కలసిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాధ్, అలాగే, కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తున్నాయని అంటున్నారు. ఇక మంత్రి గుడివాడ సీటు ఎక్కడో ఇప్పటికీ తేలలేదు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి సీటుని భరత్ కుమార్ కి కేటాయించారు. దాంతో గుడివాడకు సీటు ఎక్కడ చూపిస్తారు అన్నది చర్చగా ఉంది.

అలాగే సీనియర్ ఎమ్మెల్యే రాం భూపాల్ రెడ్డి విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది అని అంటున్నారు. ఆయనకు ఈసారి టికెట్ లేకుండా చేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయని అంటున్నారు. ఎంపీ సీట్ల విషయానికి వస్తే గుంటూరు, నర్సారావుపేట, నంద్యాల వంటివి తేలాల్సి ఉంది అని అంటున్నారు. నర్సారావుపేటలో ఉన్న సిట్టింగ్ ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయలకు గుంటూరు సీటు చూపిస్తున్నారు. నర్సారావుపేటకు ఎవరికి ఇంచార్జిగా చేస్తారు అన్నది చూడాలని అంటున్నారు.

నంద్యాల ఎంపీ సీటుకు ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఈసారి ఆ సీటుని మైనారిటీ వర్గానికి ఇస్తారని అంటున్నారు. సినీ నటుడు అలీ అని అనుకున్నారు కానీ ఆయన ఆయన కాదని అంటున్నట్లుగా భోగట్టా. దాంతో ఆ సీటుని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషాకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మరింతమందికి కూడా స్థాన చలనం ఈ జాబితాలో ఉండవచ్చు అని అంటున్నారు. అన్నీ కలుపుకుని ఒకటి రెండు రోజులలో ఐదవ జాబితా ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News