'యనమల వర్సెస్ కామినేని'... చంద్రబాబు కేబినెట్‌లో ఆ సీటు వారికేనా?
ఇక, మిగిలివారంతా కూడా.. టీడీపీ ఎమ్మెల్యే. దీంతో 25 వరకు మంత్రులు ప్రమాణం చేసినట్టు అయింది.కానీ, మరో సీటును ఖాళీగా ఉంచారు. వాస్తవానికి ఆ సీటు వ్యవహారం చర్చకు రాలేదు.
తాజాగా ఏర్పడిన చంద్రబాబు కేబినెట్‌లో ఒక సీటు ఖాళీగా ఉంది. దీంతో ఇప్పుడు ఆ సీటు ఎవరికి అంటూ చర్చ సాగుతోంది. ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 15 శాతం చొప్పున కేబినెట్ ఏర్పడుతుంది. అంటే.. 26.25 అన్నమాట. మొత్తం కేబినెట్‌లో 26 మంది వరకు చట్టం అనుమతిస్తుంది. దీని ప్రకారం.. చంద్రబాబు కేబినెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ.. తాజా అంచనాలు ఎలా ఉన్నా.. సంఖ్య మాత్రం 25 దగ్గరే ఆగిపోయింది.
ప్రస్తుతం చంద్రబాబుతో కలిపి 25 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు.. జనసేన వారుకాగా, బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత వరకుబాగానే ఉంది. ఇక, మిగిలివారంతా కూడా.. టీడీపీ ఎమ్మెల్యే. దీంతో 25 వరకు మంత్రులు ప్రమాణం చేసినట్టు అయింది.కానీ, మరో సీటును ఖాళీగా ఉంచారు. వాస్తవానికి ఆ సీటు వ్యవహారం చర్చకు రాలేదు.
కానీ, లెక్క ప్రకారం మాత్రం ఈసీటును కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ.. దీనిని ఖాళీగా ఉంచడం వెనుక ఏమై ఉంటుందనే చర్చ సాగుతోంది. ఒకటి టీడీపీ సీనియర్ నాయకుడు, చంద్రబాబుకు సన్నిహి తుడు యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరు. నిజానికి ఆయనకు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చంద్రబాబు ఎప్పుడూ మంత్రి పదవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కోసమే ఈసీటును అలా ఖాళీగా ఉంచారా? అనేది చర్చ.
ఇది కాదని అంటే.. బీజేపీలో ఉన్న సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాసరావు కూడా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వారే. ప్రస్తుత చంద్రబాబు టీంలో ఆయన కూడా ఉంటారని అందరూ అనుకున్నారు. పైగా బీజేపీలో ఉన్న వెంకయ్యనాయుడుకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. దీంతో కామినేనికి సీటు ఖాయమని అందరూ అంచనా వేసుకున్నారు.
అయితే.. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతైనా మంత్రి పీఠం ఆయనకు అప్పగించే అవకాశం ఉందని మరో చర్చ సాగుతోంది. ఏదేమైనా.. ప్రస్తుతం జరిగిన కార్యక్రమానికి వీరిద్దరు మాత్రమే దూరంగా ఉన్న నేపథ్యంలో ఆ ఒక్కసీటును వీరిలో ఒకరికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.