అర్హత లేకున్నా చిక్కీల టెండర్లు వారికి ఎలా దక్కాయి చంద్రబాబు?

దీనికి కారణం.. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు వైసీపీ నేతల హవా ఒక రేంజ్ లోనడుస్తోందని వారు చెబుతున్నారు.;

Update: 2025-03-02 07:30 GMT

ఒక తీవ్రమైన ఆరోపణ చంద్రబాబు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ఒకవైపు వైసీపీ నేతలకు ఎలాంటి మేలు చేయొద్దని.. వారికి సాయం చేయటమంటే.. పాముకు పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ మాటలు అన్న చంద్రబాబుకు.. తన ప్రభుత్వంలో ఏం జరుగుతుందన్న విషయంపై పట్టు ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ క్యాడర్. దీనికి కారణం.. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు వైసీపీ నేతల హవా ఒక రేంజ్ లోనడుస్తోందని వారు చెబుతున్నారు.

దీనికి ఉదాహరణగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక టెండర్లలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన టెండర్లలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వియ్యంకుల హవా నడుస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని నాలుగుః జోన్ల పరిధిలోనూ చిక్కీల సరఫరా వారికి కట్టబెట్టేందుకు వీలుగా రంగం సిద్ధమైందన్న మాట బలంగా వినిపిస్తోంది.

చిక్కీల సరఫరాకు రాష్ట్రంలో 6 జోన్ల వారీగా టెండర్లు పిలిచారు. వీటి విలువ రూ.24 కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఈ టెండర్లలో వైసీపీ నాయకుడు వాసుపల్లి వియ్యంకులైన పూరి జగన్నాథ్ ఎంటర్ ప్రైజస్ భాగస్వాములు ఉన్నారు. నెల్లూరు జిల్లాకుచెందిన వీరి కంపెనీ టర్నోవర్ రూ.59.66 కోట్లు. వీరి కంపెనీకి రెండు జోన్లకు మాత్రమే బిడ్లు వేసే అర్హత ఉందని.. కానీ నాలుగు జోన్లకు వేయటాన్ని ప్రశ్నిస్తున్నారు.

అయినా.. అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో 3 జోన్ల టెండర్లు దాదాపు దక్కించుకున్నారని.. ఒక జోన్ రెండో స్థానంలో ఉందని.. మరో జోన్ లో పొందిన కంపెనీ కూడా వీరిదేనని చెబుతున్నారు. టెండర్లు మొదటిసారి పిలిచినప్పుడు స్టేట్ పుడ్ లైసెన్సులు ఉంటే సరిపోతుందని చెప్పారని.. టెండర్లు క్లోజ్ చేసే వేళలో మాత్రం సెంట్రల్ లైసెన్సు ఉండాలన్న నిబంధన పెట్టారని చెబుతున్నారు. టెండర్లు ముగియటానికి ఒక రోజు ముందు టెండర్ల నిబంధనల్లో మార్పు చేసి.. సెంట్రల్ లైసెన్సు పొందాలన్న నిబంధన పెడితే.. రోజులో ఎలా తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కూడా కొందరికి కట్టబెట్టేందుకే ఇలా చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

Tags:    

Similar News