ఫ్యాన్ కు ఎదురుగాలిపై పార్టీ విశ్లేషణ ఇదే!

అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రత్యర్థుల నోట మాట రాలేని రీతిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

Update: 2024-06-05 04:30 GMT

ప్రపంచంలో తెలుగోళ్లు ఎక్కడున్నా అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడటం తెలిసిందే. అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రత్యర్థుల నోట మాట రాలేని రీతిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో.. అధికారపక్షం కోలుకోలేని దెబ్బ పడింది. వైనాట్ 175? అంటూ బరిలోకి దిగి.. గత ఎన్నికల్లో సొంతం చేసుకున్న 151 సీట్లకు ఒక్క స్థానమైనా అధికంగా గెలుచుకుంటామన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

అనుకున్నంత అధిక్యతను ప్రదర్శించటం అన్ని రాజకీయ పార్టీలకు సాధ్యం కాకపోవొచ్చు. అదే సమయంలో ఘోర పరాజయాన్ని పొందటం కూడా షాకిచ్చేదే. అధికార పక్షంగా బరిలోకి దిగిన వైసీపీ తాను పోటీ చేసిన 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తిరిగి అధికారంలోకి రావటం ఖాయమన్న పరిస్థితి నుంచి కనీస ప్రతిపక్ష హోదాను సైతం సాధించలేని దీన స్థితిలోకి చేరటం షాకింగ్ గా మారింది.

ఇంతకూ వైసీపీ అంత దారుణ పరాజయం పాలైంది ఎందుకు? దానికి కారణాలేంటి? అన్న దానిపై ఆపార్టీ ఇప్పటికే మధనాన్ని మొదలు పెట్టింది. ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల వ్యవధిలోనే తన ఓటమికి కారణాల్ని వెతికి.. విశ్లేషించే పనిలో పడింది. ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని వైసీపీ గుర్తించి. అందుకే.. శషబిషలకు పోకుండా.. వాస్తవాన్ని అంగీకరించకుండా పిడి వాదనల జోలికి వెళ్లకుండా.. నిందలు వేయకుండా తనలోని తప్పుల్ని.. ఎన్నికల వేళలో జరిగిన పొరపాట్లను గుర్తించింది. ఇంతకూ పరాజయంపై ఆ పార్టీ ప్రాధమిక విశ్లేషణ చూస్తే..

- వైసీపీకి మూడు పార్టీలు ఒక తాటి మీదకు రావటం. వాటికి తోడ్పాటుగా మిగిలిన పార్టీలు మారాయి.

- కూటమి ఇచ్చినన్ని హామీల్ని ఇవ్వలేకపోవటం. తాను అమలు చేయలేని హామీల్ని ఇవ్వలేనని సూటిగా చెప్పేయటం.

- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణల్ని సమర్థంగా తిప్పి కొట్టటంలో నేతల వైఫల్యం

- సచివాలయాల్ని ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినా.. జాబ్ లు ఇవ్వలేదన్న విమర్శల్ని ఎదుర్కోవటం

- కరోనా వేళ ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోవటం

- పార్టీలు..వర్గాలు అన్న తేడా లేకుండా అందరికి అన్నీ పథకాల్ని ఇవ్వటం.. ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడటం.

- సంక్షేమ ఫలాల్ని అందరికి ఇవ్వాలన్న తాపత్రయమే తప్పించి వాటిని ఓటు బ్యాంక్ కు మలుచుకోలేకపోవటం

- మూడు రాజధానుల ఏర్పాటులో లీగల్ ఇష్యూస్ దశను కూడా దాటలేకపోవటం.

Tags:    

Similar News