టీడీపీకి సరికొత్త సవాల్ చేసిన వైసీపీ !

తిరుపతిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు మీద ఇప్పటిదాకా పదికి పైగా వివిధ కేసులలో స్టేలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు

Update: 2023-09-30 16:40 GMT

నిప్పు అని చెప్పుకోవడం కాదు అంతా నమ్మేలా ఉండాలని వైసీపీ అంటోంది. చంద్రబాబు కానీ ఆయన తనయుడు కానీ మేము అవినీతి చేయలేదు అని వారు చెప్పుకుంటే ఎలా తేల్చాల్సింది కోర్టులు కదా అని అంటున్నారు. ఈ విషయంలో తమ మీద ఉన్న కేసులకు సంబంధించి స్టేల కోసం ముందస్తు బెయిళ్ల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా దర్యాప్తు సంస్థల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతున్నారు.

తిరుపతిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు మీద ఇప్పటిదాకా పదికి పైగా వివిధ కేసులలో స్టేలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కనుక చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మాత్రం స్టేలను తొలగించుకుని న్యాయ స్థానాలలో అన్నింటి మీద పూర్తి విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు.

అంతే తప్ప స్టేలు తెచ్చుకుంటూ మేము అవినీతి చేయలేదు అంటే ఎలా అని ప్రశ్నించారు. లంచాలు తిని కంచాల మోత మోగించమంటే ప్రజలు అన్నీ చూస్తున్నారు అన్నది గుర్తెరగాలని ఆయన హితవు చెప్పారు. తమ మీద ఏ కేసులు లేవు ఏమీ చేయలేరు అని చెప్పుకుంటున్న వారు తీరా కేసుల దగ్గరకు విచారణ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మోత మోగిస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు.

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ వరకూ మద్దత్తు ఇస్తున్నారు కదా. వారిని అందరూ కలసి ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాల ఇంటి ముందు కంచాలతో మోత మోగించండి అని విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. అవసరం అయితే ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందు లోకేష్ తనకు మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల నాయకులతో కంచలతో శబ్దం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినీతి మోత మోగించినందుకే చంద్రబాబుకు జైలు జీవితం ప్రాప్తించింది అని విజయసాయిరెడ్డి అన్నారు. ఆ విషయం మరచిపోయి వైసీపీ మీద నిందలు వేస్తూ వీధి పోరాటాలు చేస్తే ఏమిటి ప్రయోజనం అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆందోళన ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలని అని ఆయన నిలదీశారు. నీతివంతులు అని చెప్పడానికి కోర్టులు న్యాయ మార్గం ఉండగా ఈ రూట్ ఎందుకు మీకు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అసలు ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే ఇన్నర్ రింగ్ రోడ్డులో స్కాం జరిగింది అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే కేసు సీఐడీ పెట్టి విచారణ జరుపుతోందని అన్నారు. తండ్రి చంద్రబాబు జైలులో ఉంటే ప్రవాసంలో ఉన్న లోకేష్ ని ధైర్యవంతుడు అని టీడీపీ శ్రేణులు అంటాయా లేక ఉత్తర కుమారుడు అని భావిస్తాయా వారే చెప్పాలని వైసీపీ ఎంపీ అన్నారు.

తెలుగుదేశంలో నీతిమంతులు ఎవరైనా ఉంటే అవినీతికి మద్దతు గా జరిగే పోరాటాలకు మౌనంగా మద్దతు ఇవ్వకుండా వ్యరిరేకించడం బెటర్ అని కూడా విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రజలకు ఏమీ తెలియదు అని అనుకుంటే మాత్రం తప్పు అవుతుందని ఆయన అంటున్నారు.

Tags:    

Similar News