2029కి.. 2014 చాల‌దు.. వైసీపీ డోస్ పెంచాల్సిందే ..!

అప్ప‌ట్లో జ‌గ‌న్ అంటే.. ఒక ఐకాన్‌. యువ నాయ‌కుడు, ఏదో చేస్తార‌న్న ఆశ‌లు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. అధికా రంలోకి వ‌చ్చారు.

Update: 2024-08-11 03:50 GMT

2029 నాటికైనా వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఇప్పుడున్న దూకుడు ఏమాత్రం సరిపోద‌నే చ‌ర్చ సాగుతోంది. ఎవ‌రు ఔన‌న్నా.. ఎవ‌రు కాద‌న్నా.. రాష్ట్రంలో ప‌రిస్థితులు మాత్రం ఏమాత్రం బాగోలేవు. రోజు కొక చోట ఏదో ఒక ఘ‌ట‌న చోటు చేసుకుంటూనే ఉంది. దీనిని క‌ట్ట‌డి చేయాల‌న్న స్పృహ ఉన్నా.. క్షేత్ర‌స్థా యిలో ప‌రిస్థితులు చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో వైసీపీ అధినేత రోడ్డెక్కుతున్నారు. ఇక‌, మీద‌ట ఉద్య‌మాల‌కు కూడా రెడీ అవుతున్నారు.

అయితే.. ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఆశించిన‌ట్టుగా అయితే క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. జ‌గ‌న్ ఒంట‌రి పోరు.. ఆయ‌న నాన్చుడు ధోర‌ణి వంటివి పార్టీకి శాపంగా మారుతున్నాయి. కీల‌క నాయ‌కులు పార్టీని వ‌దిలేస్తున్నా.. మౌనంగా ఉంటున్నారు. కీల‌క నాయ‌కులు రోడ్డున ప‌డి యాగీ చేస్తున్నా.. స్పందించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీకి సానుభూతి ద‌క్క‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనికి తోడు 2014కు ముందున్న ప‌రిస్థితి ఇప్పుడు లేదు.

అప్ప‌ట్లో జ‌గ‌న్ అంటే.. ఒక ఐకాన్‌. యువ నాయ‌కుడు, ఏదో చేస్తార‌న్న ఆశ‌లు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. అధికా రంలోకి వ‌చ్చారు. కానీ.. దీని వ‌ల్ల ఆయ‌న సాధించింది.. ఎంతో కానీ.. వ్య‌తిరేక‌త మాత్రం మూట గ‌ట్టుకు న్నారు. సొంత కుటుంబంలోనే నాయ‌కులు దూర‌మ‌య్యారు. ష‌ర్మిల ఇప్పుడు ప్ర‌ధాన శ‌త్రువుగా ఉంటు న్నారు. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ మెత్త‌గా సుతిమెత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పార్టీ పుంజుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం.

ఈ నేప‌థ్యంలో 2014కు ముందున్న ప‌రిస్థితిని అదే దూకుడు, అదే ఉత్సాహం వంటివి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రీ ముఖ్యంగా కోల్పోయిన రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని చేర‌దీయ‌డం, పారిశ్రేమిక వేత్తల అభిమానాన్ని చూర‌గొన‌డం వంటివి ఇప్పుడు అత్యంత కీల‌కం. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ ఎంత వేగంగా ముందుకు క‌దిలితే.. అప్పుడు అంత వేగంగా ఆయ‌న పార్టీ పుంజుకుంటుంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. అలా కాకుండా.. ఇప్పుడు మౌనంగా ఉంటే.. పార్టీకి మ‌రింత చేటు తెస్తుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News