ఫ్లూటు జింక ముందు ఊదు... బాలయ్యకు వైసీపీ మాస్ వార్నింగ్!
ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు అయితే... బాలయ్యపై విరుచుకుపడ్డారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. అధికార ప్రతిపక్ష సభ్యుల రగడ మామూలుగా జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం సినిమాల్లో నట విశ్వరూపం చూపించిన బాలకృష్ణ... ఇప్పుడు ఏపీ అసెంబ్లీలోనూ అలాంటిపనికే పూనుకున్నట్లున్నారు! ఇందులో భాగంగా తొడ కొట్టడం, మీసం మెలేయడం చేశారు.
అయితే ఈ విషయాన్ని మొదటి తప్పుగా పరిగణించిన స్పీకర్... మరోసారి ఇలాంటి వికృత చేష్టలు చేయొద్దని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించి, ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఈ సమయంలో సస్పెన్షన్ అనంతరం బయటకు వెళ్తున్న క్రమంలో... వైసీపీ నేతలవైపు చూస్తూ బాలయ్య అసభ్యకరంగా చేయి చూపించారు. ఇది అత్యంత హేయమైన చర్య!!
ఈ క్రమంలో... బాలకృష్ణ చేష్టలపై వైసీపీ నేతలు వాయించి వదిలే పనికి పూనుకున్నారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు అయితే... బాలయ్యపై విరుచుకుపడ్డారు. "ఫ్లూటు చంద్రబాబు ముందు ఊదు... వైసీపీ ముందు కాదు" అన్న రేంజ్ లో ఫైరయ్యారు. ఇదే సమయంలో... సినిమాల్లో వ్యవహరించినట్టు వైసీపీ నేతల వద్ద పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే దబిడి దబిడే అంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు!
ఇందులో భాగంగా.. శాసనసభ సమావేశాలను బాలకృష్ణ సినిమా షూటింగ్ అనుకుంటున్నారా అంటూ రోజా మండిపడ్డారు. బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడని అన్నారు. తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చాడు.. తనకు ఓటేసిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడాడా.. అంటూ రోజా తనదైన శైలిలో ప్రశ్నించారు.
అనంతరం... అక్రమంగా ప్రజల డబ్బును దోచేసి చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని తెలిపిన మంత్రి రోజా... చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తామని.. ఎంతసేపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దమ్ముధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలని ఛాలెంజ్ విసిరారు.
ఇదే సమయంలో... తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారని హితవు పలికారు.
మరోపక్క... ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్ పై సభలో ఫైరయిన మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం ట్విట్టర్ వేదికగా మరోసారి కౌంటర్ ఇచ్చారు. "నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ!" అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!