వైసీపీ మంత్రులు పార్లమెంట్ కేనట...!

వైసీపీకి పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో ఎందరికి టికెట్లు దక్కుతాయన్న చర్చ అయితే ఇపుడు వేడిగా వాడిగా సాగుతోంది.

Update: 2023-11-27 23:30 GMT

వైసీపీకి పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో ఎందరికి టికెట్లు దక్కుతాయన్న చర్చ అయితే ఇపుడు వేడిగా వాడిగా సాగుతోంది. దాదాపుగా సగానికి సగం మంది మంత్రులకు టికెట్లు దక్కవని కూడా ప్రచారం ఉంది. అందులో కొందరిని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ముందుగా ఉత్తరాంధ్రా నుంచి చూసుకుంటే శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావుని ఈసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అక్కడ టీడీపీకి చెందిన వెలమ సామాజిక వర్గానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయనను ఓడించాలని వైసీపీ హై కమాండ్ పట్టుదలగా ఉంది. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మానను ముగ్గులోకి దించే ప్లాన్ వేశారని అంటున్నారు

అలాగే అనకాపల్లి ఎంపీ సీటుకు మంత్రి గుడివాడ అమరనాధ్ పేరుని సీరియస్ గా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఉత్తరాంధ్రాలో ఆరుగురు మంత్రులు ఉంటే ఇందులో ఇద్దరిని ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. మిగిలిన వారిలో బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, సీదరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడులకు మరోసారి టికెట్ ఖాయమని తెలుస్తోంది.

గోదావరి జిల్లాలలో చూసుకుంటే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణను రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కాకినాడ నుంచి పార్లమెంట్ కి నిలబెడతారు అని అంటున్నారు. ఈ జిల్లాలో మంత్రులు దాడిశెట్టి రాజా, తానేటి వనితలకు మళ్లీ టికెట్లు గ్యారంటీ అంటున్నారు. అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పినిపె విశ్వరూప్ కి మాత్రం టికెట్ దక్కదని తెలుస్తోంది.

క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే మంత్రి జోగి రమేష్ ని ఏలూరు లేదా విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ ఎంపీ సీటు నుంచే బీసీ ప్రయోగాన్ని ఈసారి వైసీపీ చేస్తుంది అని అంటున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజనీని నరసారావు పేట నుంచి ఎంపీగా పోటీకి దించుతారు అని తెలుస్తోంది. అక్కడ అగ్ర సామాజిక వర్గానికే ఎపుడూ టికెట్ ఇస్తున్నారు. ఈసారి మాత్రం బీసీలతో ప్రయోగం చేయాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

రాయలసీమ నుంచి మంత్రులుగా ఉన్న వారిలో గుమ్మలూరి జయరాం ని కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అదే విధంగా మహిళా మంత్రి ఉషశ్రీ చరణ్ ని హిందూపురం నుంచి ఎంపీగా పంపుతారు అని అంటున్నారు. ఇక మంత్రులుగా ఉన్న వారిలో బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డికి డోన్ నుంచి మళ్లీ పోటీకి చాన్స్ ఉంది.

కడప నుంచి అజ్మాద్ భాషాకే టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారీడ్డి, నెల్లూరు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ లకు టికెట్లు కన్ ఫర్మ్ అంటున్నారు మరో మంత్రి మేరుగు నాగార్జునకు సీటు మార్చి టికెట్ ఇస్తారని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి మాత్రం టికెట్ దక్కదనే చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సగానికి సగం మంది మంత్రులకు మాత్రం అసెంబ్లీ టికెట్లు ఈసారి దక్కవనే అంటున్నార

Tags:    

Similar News